Big TV Kissik Talks: బిగ్ టీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న “బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్”(Big tv Kissik Talks) ఎంతో పాపులారిటీ సొంతం చేసుకునే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష(Varsha) యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి సీరియల్ నటి ప్రేరణ (Prerana)హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష అడిగా అన్ని ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ వచ్చారు. సినిమాల గురించి సీరియల్స్ గురించి అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రేరణ ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇకపోతే ప్రేరణ ప్రముఖ సినీనటి రష్మిక మందన్నకు (Rashmika Mandanna)మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని ఈమె బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి వెళ్లే ముందు నాగార్జున రివీల్ చేశారు.
రష్మికను చూస్తే గర్వంగా ఉంది..
ఇకపోతే తాజాగా వర్ష కూడా రష్మిక గురించి ప్రేరణను ప్రశ్నలు వేశారు. మీరు చూడటానికి కాస్త రష్మిక లాగా ఉంటారు అని చెప్పడమే కాకుండా రష్మికతో తన స్నేహబంధం గురించి ప్రశ్నించారు. రష్మిక తను మోడలింగ్ చేసేటప్పుడు ఒకే చోట ఉండే వాళ్ళమని మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ తెలియజేశారు. ఇక రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయింది కదా మీరు తనకు గుర్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మర్చిపోయే ఫ్రెండ్షిప్ కాదు మాది మేమిద్దరం చాలా క్లోజ్ అని అయితే ఇటీవల కాలంలో తనని కలిసిన సందర్భం రాలేదని తెలియజేశారు.
మర్చిపోయే ఫ్రెండ్షిప్ కాదు మాది..
రష్మిక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుందని, తన బిజీ షెడ్యూల్ కారణంగా నన్ను కలవడం కుదరలేదని ప్రేరణ తెలిపారు. ఇక మా ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్ అంటూ ఈమె తెలియజేశారు. మేమిద్దరం ఎప్పుడు సినిమాలు గురించే మాట్లాడుకునే వాళ్ళం. మా ఇంట్లో వాళ్ళు కూడా రష్మిక కన్నడలో సక్సెస్ కావాలని, నేను తెలుగులో సక్సెస్ కావాలని కోరుకునేవారు. మేమిద్దరం కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలో కూడా చేయాలని అనుకున్నాము కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదని తెలిపారు.
ఇకపోతే రష్మికకు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా చెప్పండి అంటూ వర్ష చెప్పగా “రేయ్.. ముందు వచ్చి కలువురా”అంటూ ప్రేరణ తెలియజేశారు. నిజానికి తాను చాలా స్వీట్ అంటూ రష్మిక గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక తనకు సినిమాలలో ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తానని ,అందరూ నన్ను కీర్తి సురేష్(Keerthy Suresh) లాగా ఉన్నాను అని చెబుతుంటారు కానీ ఒక డైరెక్టర్ కు కూడా నేను అలాగా కనిపించలేదేమో అందుకే నాకు సినిమా అవకాశాలు ఇవ్వలేదు అంటూ చెప్పుకువచ్చారు. ఇక సినిమాలలో తనకు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అయితే రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ వంటి సీన్లకు తాను దూరంగా ఉంటాను అంటూ ఈ సందర్భంగా ప్రేరణ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: ప్రేరణ శ్రీ పాద్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్… అవకాశాలు లేవా?