Thaman : అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ సినిమాలు ఆపేస్తారు అనుకున్న టైంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా గురించి రిక్వెస్ట్ చేయడం వలన మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాను అద్భుతంగా డిజైన్ చేశాడు.
పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడినట్లు ఎలివేషన్స్ సీన్స్ కూడా రాశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి హై వచ్చేటట్లు సినిమాను డిజైన్ చేశాడు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చే స్టేట్మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడు సినిమాలకు తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అందువలన ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా గురించి రీసెంట్ గా తమన్ మాట్లాడుతూ.. “OG వస్తుందిగా సెప్టెంబర్ 25 న, అన్ని లెక్కలు సెటిల్ చేద్దాం” అంటూ చెప్పుకోచ్చారు. అన్ని లెక్కలు సెటిల్ చేద్దాం అన్న స్టేట్మెంట్ లోనే రికార్డ్స్ అన్ని సెటిల్ అయిపోతాయి అనే నమ్మకం కలుగుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు.
అంచనాలకు కారణం
పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉండడానికి కారణం సుజిత్ దర్శకుడు అవ్వడమే. సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు చాలామంది అభిమానులులానే సుజిత్ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచిన వీడియోలు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వైరల్ గా మారాయి. అన్నిటిని మించి ఈ సినిమా గ్లిమ్స్ విడుదలైనప్పుడు, అందరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ కంటే కూడా ఈ ప్రాజెక్టు పైన విపరీతమైన నమ్మకం ఉంది.
Also Read: Hari Hara Veeramallu: ట్రస్ట్ ది ప్రాసెస్ అంటే ఎలా అండి? అందరూ బయటకు రావాలిగా?