E-Paper
Advertisement

CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహ మహోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హెలిపాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హెలిక్యాప్టర్ లో గద్వాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి, శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.

Also Read: Gold Prices: యుద్ధం వస్తే పెరగాలి.. కానీ తగ్గుతోంది! బంగారం రివర్స్ ట్రెండ్‌కు అసలు కారణాలివే!

వివాహ వేదిక వద్దకు పటిష్ట పోలీస్ బందోబస్తు

Advertisement

అక్కడి నుంచి ఐజ రహదారిలో ఉన్న వివాహ వేదిక వద్దకు పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ వేదిక వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పలువురు నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఇంటలిజెన్సీ అధికారులు, పోలీస్ బందోబస్తుతో కళ్యాణ వేదిక పైకి చేరుకున్న ముఖ్యమంత్రి నూతన వధూవరులకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో వివాహానికి వచ్చిన అశేష జనం సందడి చేయగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ నమస్కరించారు. అనంతరం తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు, జోగులాంబ జోన్ డిఐజి ఎల్. ఎస్. చౌహన్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: US–Iran War: ఇరాన్ ముందు ట్రంప్ ప్లాన్ ఫెయిల్.. యుద్ధం ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా లేదా!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×