E-Paper
Advertisement

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?
Advertisement

 Raja Saab Failure:ఈ ఏడు జనవరి9న పొంగల్ సీజన్ లో రిలీజ్ అయిన రాజసాబ్ బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసిన సంగతి తెల్సిందే.ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక నైట్ మేర్ లా మిగిలిపోయింది.అయితే తాజాగా అక్టోబర్ 17న గరివిడి లక్ష్మి రిలీజ్ కానున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రాజాసాబ్ ఫెయిల్యూర్ పై ఇలా ఆసక్తి కరంగా స్పందించాడు.

కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతోనే

Advertisement

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై గూడచారి,కార్తికేయ,ధమాకా వంటి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేశామని,అలా కుదిరాయని అయితే సక్సెస్ లతో పాటు ప్లాపులని కూడా చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు.అయితే రాజసాబ్ విషయంలో కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతోనే బడ్జెట్ పెట్టామని,పైగా సినిమా కూడా భాగానే ఉంటుందని చెప్పుకొచ్చారు.

రిలీజ్ అయిన సీజన్ రాంగ్

Advertisement

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సీజన్ రాంగ్ అని,అలా కాకుండా ఆ సినిమా మరే సమయంలో రిలీజ్ అయినా ఇంకా మంచి వసూల్లన్ని రాబట్టేదని మనసులోని మాటని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్.పైగా రిలీజ్ అయిన రోజు కూడా చాలా లేట్ గా రిలీజ్ అయిందని,టికెట్ రేట్స్ పెంచుకునే పని వల్ల షోలు కాస్త లేట్ గా పడ్డాయని పైగా ఆ రోజు షోలు లేట్ అవడం వల్ల ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ బాగా ప్రస్టేట్ అయ్యారని ఇలా చాలా కారణాలు ఆ సినిమా ఫలితంపై ప్రభావం చూపించాయని వాపోయారు.అసలు ఆ సినిమాకి టికెట్ రేట్స్ పెంచే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుండేది అని తనదైన శైలిలో విశ్లేషించారు విశ్వప్రసాద్.

తప్పులు మళ్ళీ రిపీట్ చేయం 

ఇక సినిమాలు చేసేటప్పుడు అది ఎంత వసూలు చేస్తుంది అన్నది కాకుండా ఆ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ చేసుకుంటూ పోతామని,ఒక్కోసారి ఆ ప్రాసెస్ లో బడ్జెట్ కూడా పెరుగుతుందని, రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు.ఇక ముందు నుండి చాలా పకడ్బందీగా అన్నీ చూసుకుని సినిమాలు చేస్తామని,ఇక మాకు హిట్స్ వచ్చిన 2024, 2025 ఇయర్స్ మళ్ళీ సక్సెస్ సినిమాలతో రిపీట్ కావాలని కోరుకుంటున్నామని , చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయామని తెలిపారు.

ఆ తప్పులు చేయకుండా సినిమాలు ఎలా చేస్తాడో !

ఇక స్పిరిట్ సినిమా టాపిక్ రాగా ఆ సినిమాకి నేను కేవలం డిస్టిబ్యూటర్ ని మాత్రమే అని,అయినప్పటికీ ఆ సినిమాని ఎంత స్కేల్ లో రిలీజ్ చేయాలో ,ఎన్ని థియేటర్స్ లో వేయాలో అలాగే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే సినిమాని డిస్టిబ్యూట్ చేస్తామని తెలిపారు.

ALSO READ :కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

చూడాలి మరి తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్న ఈ బడా ప్రొడ్యూసర్ ముందు ముందు ఆ తప్పులు చేయకుండా సినిమాలు ఎలా చేస్తాడో !

Tags

Related News

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

Big Stories

Advertisement
×