E-Paper
Advertisement

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!
Advertisement

Vijay Chandrababu: ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు తమిళనాడు సీఎం విజయ్ చరుకున్నారు. దీంతో విజయ్ కు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ స్వాగతం పలికారు. అనంతరం సీఎం విజయ్ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సీఎం విజయ్ కు పూర్ణకుంభ స్వాగతంను వైదిక కమిటీ సభ్యులు, దుర్గగుడి అధికారులు పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారీగా వచ్చిన అభిమానులు..

తమిళనాడు సీఎం విజయ్ కి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ అనంతరం ఎపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. దీంతో విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఉండవల్లికి సీఎం విజయ్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నివాసంలో విజయ్‌కు స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేశ్ చంద్రబాబు–విజయ్ భేటీలో తెలుగు గంగ నీటి అంశంపై చర్చించారు. చెన్నై తాగునీటి అవసరాలకు మరింత కృష్ణా జలాలు ఇవ్వాలని తమిళనాడు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని అందించిన ఏపీ గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు జరుపుతున్నారు.

కేంద్ర సహకారంతో..

Advertisement

బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా కావేరీకి గోదావరి జలాల తరలింపుపై సమాలోచనలు చేస్తున్నామని, కేంద్ర సహకారంతో దక్షిణాది నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చించారు. చంద్రబాబు–విజయ్ భేటీపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆసక్తి రేపింది. చంద్రబాబుతో భేటీ అనంతరం విజయవాడ ఉత్సవ్‌లో సీఎం విజయ్ పాల్గోననున్నారు. విజయ్ తో సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హజరు కాకపోవడంతో కొంత విస్మయానికి గురిచేసింది.

Also read: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

Tags

Related News

విశాఖ మేయర్ పీఠం కోసం తీవ్ర ఉత్కంఠ పోరు.. టీడీపీ, వైసీపీలో వినిపిస్తున్న పేర్లు ఇవే?

రాజమండ్రి మున్సిపల్ మేయర్ ఆశావహులకు బిగ్ షాక్.. తలకిందులైన లెక్కలు!

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీన్ రివర్స్.. జనసేనలోకి వంగవీటి రాధా! విజయవాడ మేయర్‌గా బరిలోకి

విజయసాయిరెడ్డికి మళ్లీ ఏమైంది.. బాల్‌ఠాక్రే‌తో పోలిక పెట్టి, ఆ తర్వాత..

పబ్‌లో ఏపీ ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసు అధికారులపై దూషణలు, ఎవరా ఆ అధికారి?

Big Stories

Advertisement
×