E-Paper
Advertisement

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!
Advertisement

Ladakh Border Dispute: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని 28 కీలక వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తిస్తూ వాటికి అధికారిక పేర్లను సైతం కేంద్రం పెట్టడాన్ని చైనా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టింది. లద్దాఖ్ కు భారత్ తో విడదీయరాని బంధం ఉందని.. తమ దేశంలో అది అంతర్భాగమని చైనాకు స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే?

లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉన్న గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలతో పాటు మొత్తం 28 లొకేషన్లను అక్టోబర్ 2న భారత మ్యాప్‌లో కేంద్రం అధికారికంగా చేర్చింది. లద్దాఖ్ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాలను గుర్తించడం, సున్నితమైన సరిహద్దు ప్రాంతంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అయితే 2020లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్‌లు ఘర్షణకు కేంద్రాలుగా మారడం గమనార్హం.

మ్యాప్‌లో చోటు దక్కిన ప్రాంతాలు

Advertisement

భారత సర్వే మ్యాప్‌లో కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో అలిషా గిరి (ఉన్నత శిఖరం), బ్రాంగ్సా, చప్‌చింగాల్ పాస్, కనిష్క పీక్, కరున్ పిర్ పర్వతం, కుక్సెల్, మార్తాండ్ గిరి, పార్పిక్ హిమానీనదం, స్కంరి గిరి, షచ్మిరిక్ పాస్, శ్కోర్గా లోయ, జొరావర్ పీక్, డెహ్రా కంపస్, డ్రాక్ కార్పో ఉన్నాయి. వీటితో పాటు జోల్మోరి, కుమారాయణ పాయింట్, పాంగ్లుంగ్, రించెన్ జాంగ్పో, శక్యశ్రీ గిరి, గురు రిన్‌పోచే, శమల్ లుంగ్పా, యాంగ్పా నది, మార్పా లోట్సావా రి, మిలరేపా కాంగ్రి, శివ రి, మహేశ్వర రి తదితర పేర్లను కూడా జాబితాలో చేర్చారు.

భారత్ నిర్ణయంపై చైనా అభ్యంతరం..

ఈ చర్యపై చైనా స్పందించింది. భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ‘కేంద్రపాలిత ప్రాంతం లడఖ్’ను తాము ఎప్పుడూ గుర్తించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలపై చైనా వాదనను ఈ చర్యలు ఏమాత్రం మార్చలేవని ఆమె ఆరోపించారు.

భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

మరోవైపు చైనా ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరానిదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనా ఎన్నిసార్లు ఈ విషయాన్ని ఖండించినా.. ఈ వాస్తవాన్ని మార్చలేవని తేల్చిచెప్పింది.

Also Read: విమానాల్లో సిగరేట్‌పై నిషేధం.. కానీ బాత్రూమ్‌లో యాష్ ట్రేలు ఎందుకు? కారణం తెలిస్తే ఆశ్చర్యమే!

గల్వాన్ ఘర్షణల నేపథ్యం

తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ లో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. 1975 తర్వాత ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవడం అదే మొదటిసారి. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండేళ్ల పాటు ఉద్రిక్తతలు కొనసాగిన తర్వాత, ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనిక అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లను ఖరారు చేయడం ద్వారా భారత్ తన సరిహద్దులపై పూర్తి పట్టును చాటుకుంది.

Also Read: రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

Tags

Related News

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. మార్జిన్ 30 శాతానికి కట్!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

రాహుల్ గాంధీ బృందాన్ని కలవని సీజేఐ.. కోర్టు పరిధిలోని అంశాలపై చర్చకు నో!

కోలుకున్న భారత రూపాయి విలువ.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం?

Big Stories

Advertisement
×