E-Paper
Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!

కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!
Advertisement

Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సినిమా వెనుక ఉన్న అసలు కథ, జక్కన్న టీమ్ పడ్డ కష్టం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి ది టార్చ్ బ్యారర్’ పేరుతో ఓ క్రేజీ డాక్యుమెంటరీ సిరీస్ తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూ జక్కన్న అలియాస్ రాజమౌళి లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఒక హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి అసలు కథ:

‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు రాజమౌళి టీమ్ మొత్తం నాలుగేళ్లకు పైగా రాత్రింబగళ్లు కష్టపడ్డారు. ఇక ఆ అద్భుత ప్రయాణాన్ని మొత్తం 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ మన ముందుకు తెచ్చింది. కెమెరా వెనుక రాజమౌళి పడ్డ తపన, యాక్షన్ సీన్ల కోసం పడ్డ శ్రమ, రమా రాజమౌళి, కార్తికేయ, కీరవాణి, శోభు యార్లగడ్డ పంచుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

రాజమౌళిని ఏడిపించిన ఆ సంఘటన:

Advertisement

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ‘బాహుబలి 2’ రిలీజ్ తర్వాత జరిగిన ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్‌ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కీరవాణి భార్య, తన వదిన అయిన శ్రీవల్లిని ఒకచోట ఒక పెద్దావిడ కలిశారట. “నువ్వు బాహుబలి సినిమాలో పని చేశావు కదామ్మా.. చాలా థ్యాంక్స్. నాకు క్యాన్సర్ ఉంది. బాహుబలి పార్ట్-2 చూడకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల సినిమా చూసేశాను, చాలా సంతోషంగా ఉంది” అని ఆ పెద్దావిడ శ్రీవల్లితో అన్నారట.

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన జక్కన్న:

ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నారు. సినిమా అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. ఇక ఎప్పుడూ ఎంతో గంభీరంగా, స్ట్రిక్ట్‌గా కనిపించే జక్కన్న ఇలా ఎమోషనల్ అవ్వడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

Advertisement

బాహుబలి సినిమా కేవలం కలెక్షన్ల రికార్డులు మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలను గెలుచుకుందని రాజమౌళి మాటలను బట్టి మరోసారి ప్రూవ్ అయింది. జక్కన్న కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. బాహుబలి వెనుక ఉన్న ఇలాంటి ఎన్నో గుండెకు హత్తుకునే నిజమైన కథలను చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ‘టార్చ్ బ్యారర్’ సిరీస్‌ని అస్సలు మిస్ కాకూడదు.

also read: Kissik Talks: పెళ్లిపై రేఖ షాకింగ్ కామెంట్.. కాబోయే భర్తకు అలాంటి లక్షణాలు ఉండాలంటూ!

 

Related News

త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?

ఒక్కో పాట ఓ సెన్సేషన్.. రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఇవే!

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీమ్..నాని ప్రత్యేక పూజలు!

రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత తీసుకునేవారో తెలుసా?

నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!

డీజే సౌండ్స్ పై శిరీష్ ఫిర్యాదు… అల్లు అర్జున్ పై భారీ ట్రోల్స్!

రజనీకాంత్ ‘ధర్మాన్’లో టాలీవుడ్ హీరో…ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన రాశి కన్నా!

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!

Big Stories

Advertisement
×