Coolie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా కూలీ. విపరీతమైన అంచనాలతో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను ఆ స్థాయిలో అందుకోలేకపోయింది. అలా అని సినిమా మరీ డిజాస్టర్ కూడా కాదు. సినిమా అంతంత మాత్రమే ఉంది. లోకేష్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుంది అంటే ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రూవ్ చేశాయి.
ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు భారీ స్టార్ కాస్ట్ నటించింది. అయితే ప్రతి స్టార్ కాస్ట్ ను కూడా క్యారెక్టర్ తో పాటు ఇంట్రడ్యూస్ చేశాడు లోకేష్. అలా ఇంట్రడ్యూస్ చేయటం వలన సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలానే ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి సినిమాకు వచ్చారు. తీరా సినిమా చూసేసరికి అంతా బెడిసి కొట్టింది.
రజినీకాంత్ డామినేట్ చేశాడు
మలయాళం ఇండస్ట్రీలో చాలామంది పెద్దపెద్ద నటులు ఉన్నారు. అందులో సౌబిన్ ఒకరు. సౌబిన్ చేసిన ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపు పొందుకున్నాడు. ట్రాన్స్ వంటి సినిమాలో తన పర్ఫామెన్స్ చూసి తెలుగు ఆడియన్స్ అతని సినిమాలను వెతుక్కుని చూశారు. సౌబిన్ కూలీ సినిమాలో దయాల్ పాత్ర చేస్తున్నాడు అని లోకేష్ చెప్పినప్పుడు రజినీకాంత్ నమ్మలేదు. ఈ పాత్రను ఇతను చేయగలడా అని సందేహం వ్యక్తం చేశాడు. అలానే చాలా పొట్టిగా ఉన్నాడు బట్ట తల ఉంది అని అనుకున్నాను అని రజనీకాంత్ చెప్పారు.
అప్పుడు రజినీకాంత్ ను లోకేష్ కన్విన్స్ చేశాడు. కానీ తీరా సినిమా చూస్తే రజినీకాంత్ ను కొన్ని సీన్స్ లో సౌబిన్ అలవోకగా డామినేట్ చేసేసాడు. సినిమా మొత్తం చూస్తే ఎక్కువ నిడివి సౌబిన్ పాత్రకు ఉంది అని ఫీలింగ్ కలుగుతుంది. మొదటిసారి రజినీకాంత్ ని దయాల్ పాత్ర ఫేస్ చేసినప్పుడే చాలామందికి సౌబిన్ పై ఇంప్రెస్ కలిగింది.
లోకేష్ జాగ్రత్తపడాలి
లోకేష్ కనకరాజ్ కు మంచి బ్రాండ్ వ్యాల్యూ ఉంది. దానిని ప్రస్తుతం లోకేష్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ముందు ముందు చేయబోయే సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్త పడాలి. స్టార్ కాస్ట్ ను పెట్టి మళ్లీ సినిమా చేయాలి అంటే పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది అని ఈ సినిమాతో అర్థం అవుతుంది. రజినీకాంత్ ను లోకేష్ కనగరాజ్ కలిసినప్పుడు, నేను కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పారట. బహుశా అందుకేనేమో విక్రం స్థాయి హిట్ సినిమాను రజినీకాంత్ ఖాతాలో వేయలేకపోయాడు లోకేష్.
Also Read: Coolie : అమీర్ ఖాన్ రోలెక్స్ ఏం కాదు… పక్కా కమెడియన్