Coolie Movie Audio Launch: మోస్ట్ అవైయిటెడ్ మూవీ కూలీ (Coolie Movie) విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 14న ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, శ్రుతి హాసన్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.
క్లైమాక్స్ లో ఆమిర్ ఎంట్రీ
ఆయన క్లైమాక్స్ కనిపించనున్నాడని తెలుస్తోంది. అన్ని భాషల్లోనూ కూలీ విపరీతమైన బజ్ ఉంది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా భారీ గానే ప్లాన్ చేసింద మూవీ టీం. ఇప్పటికే డైరెక్టర్, హీరోయిన్ శ్రుతిలు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ మూవీ విశేషాలను షేర్ చేశారు. దీంతో మూవీపై మరింత హైప్ పెరిగింది. అలాగే అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండటంతో కూలీపై మరింత హైప్ నెలకొంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ కూలీ ట్రైలర్ తో పాటు ఆడియోని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం
ఈ మేరకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సాయంత్రం 7 గంటల ట్రైలర్ విడుదల కానుండగా.. తాజాగా ఆడియోని విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ ఆడియో సాంగ్స్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని మొత్తం ఆరు పాటలను ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి య్యూట్యూబ్ ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఈవెంట్లోనే రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ హిట్స్ పాటలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ప్రస్తుతం చెన్నై నెహ్రు స్టేడియం వేదికగా కూలీ ట్రైలర్ ఈవెంట్ తో పాటు రజనీకాంత్ 50 ఏళ్ల ఇండస్ట్రీని సెలబ్రేట్ చేస్తున్నారు. కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం గోల్డ్ స్మంగ్లింగ్ నేపథ్యంలో సాగనుందట.
పాటలతో దద్దరిల్లిన నెహ్రూ స్టేడియం
సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలంటే డ్రగ్స్, గన్స్ వాడకం బాగా ఉంటుంది. కానీ, కూలీ మాత్రం గోల్డ్ స్మగ్లింగ్ ప్రధానంగా ఉండనుందట. ఇందులో రజనీ దేవా పాత్రలో నటించబోతున్నారు. ఖరీదైన బంగారు గడియారాల స్మగ్లింగ్ చూట్టూ కూలీ కథ సాగుతుంది. ఇక నాగార్జున సిమోన్ అనే గ్యాంబ్లర్ గా నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. ఇక ఉపేంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం కూలీ మూవీకి వార్ 2 కంటే ఎక్కువ బజ్ ఉందంటున్నాయి సినీ వర్గాలు. కూలీ ఉన్న హైప్ చూస్తుంటే ఈ చిత్రం రూ. 1000 కోట్లు కొట్టడం పక్కా అంటున్నారు.
Also Read: Prabhas Raja Saab: ఓజీ ఫైర్ స్ట్రోమ్ కమ్మింగ్ ఎఫెక్ట్.. రాజాసాబ్‌కి థమన్ వద్దు బాబోయ్