Indian Railways: ప్రయణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే దసరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. రద్దీకి అనుగుణంగా రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీదులుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా డివిజన్ల పరిధిలో దసరా సందర్భంగా అదనపు సర్వీసుల డిమాండ్ కు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటుంది.
దసరా రిజర్లేషన్లు ప్రారంభం
నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత గ్రామాలు చేరుకుంటారు. వారం రోజుల పాటు నగరాలన్నీ ఖాళీ అవుతాయి. రైళ్లే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రైళ్లన్నీ ఫుల్ అవుతాయి. ప్రతీ ఏటా పండుగల ప్రయాణాలతో రైళ్లు ఇసుకేస్తే రాలనంత మంది ప్రయాణీకులతో వెళ్లాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో పండుగ చివరి మూడు రోజుల వరకు రద్దీ కొనసాగుతోంది. లాంగ్ జర్నీ రైళ్లల్లో ముందస్తుగానే రిజర్వేషన్లు పూర్తవుతాయి.
ఇక ఈసారి దసరా రద్దీకి అనుగుణంగా ముందస్తుగానే అదనపు రైళ్లను ప్రకటించేలా రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా IRCTC వెబ్ సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభించింది. ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ప్రస్తుత రైళ్లకు అదనపు కోచ్ లు
ఇక ముందస్తు రిజర్వేషన్ లో భాగంగా సెప్టెంబరు 30 ప్రయాణానికి (ఇవాళ) శనివారం రిజర్వేషన్ ప్రారంభమైంది. అదే విధంగా అక్టోబరు 1వ తేదీ ప్రయాణానికి ఆదివారం, అక్టోబరు 2వ తేదీ ప్రయాణానికి సోమవారం, అక్టోబరు 3వ తేదీ ప్రయాణానికి మంగళవారం, అక్టోబరు 4వ తేదీ ప్రయాణానికి బుధవారం, అక్టోబరు 5వ తేదీ ప్రయాణానికి గురువారం, అక్టోబరు 6వ తేదీ ప్రయాణానికి శుక్రవారం ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి అన్నిరకాల రిజర్వేషన్ ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు రైల్వే శాఖ అదనపు రైళ్ల నిర్వహణతో పాటుగా ప్రస్తుతం ఉన్న రైళ్లకు డిమాండ్ మేరకు కోచ్ ల సంఖ్య పెంపు పైనా ఆలోచనలు చేస్తున్నారు.
Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!
అదనపు బస్సులపై ఆర్టీసీ కసరత్తు
రైల్వేశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సైతం దసరా ప్రత్యేక బస్సుల గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏ మార్గాల్లో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై ఆరా తీస్తున్నారు. అన్ని డిపోల నుంచి అదనపు బస్సుల డిమాండ్ గురించి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?