Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రజినీకాంత్ (Rajinikanth) నటించిన జైలర్ 2 (Jailer 2) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రజనీకాంత్ జైలర్ 2 సినిమా చేయడానికి గల కారణాలు అలాగే పేట 2, భాషా2 (Baasha2)సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. నిజానికి తనకు సీక్వెల్స్ సినిమాలో నటించడం ఇష్టం ఉండదని తెలిపారు. అందుకే తాను గతంలో భాషా2, పేట 2 సినిమాలను చేద్దామని దర్శక నిర్మాతలు చెప్పినప్పటికీ తాను మాత్రం చేయనని రిజెక్ట్ చేసినట్లు రజినీకాంత్ తెలిపారు. సాధారణంగా సీక్వెల్ పట్ల నాకు ఆసక్తి ఉండదు మొదటి భాగానికి కాస్త ఫ్లేవర్స్ జోడించి పార్ట్ 2 తీస్తారని నా ఉద్దేశం అందుకే భాషా2 చేయలేదు అదే విధంగా విజయ్ సేతుపతి పాత్రను పొడిగిస్తూ పేట 2 సినిమా చేస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తనకు చెప్పారు. అందుకే ఈ సినిమాను కూడా తాను రిజెక్ట్ చేశానని తెలిపారు. మరి జైలర్ 2 సినిమా చేయడానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా రజినీకాంత్ తెలియజేశారు.
తాను జైలర్ సినిమా ఓటీటీలో విడుదల అయిన తర్వాత మరోసారి చూసానని తెలిపారు. అప్పుడు నా మనసు మారిందని అందుకే సీక్వెల్ సినిమాకు ఓకే చెప్పానని రజనీకాంత్ తెలిపారు. జైలర్ సినిమా క్లైమాక్స్ లో విగ్రహాల స్మగ్లర్ వర్మను అంతం చేసే ముందు ఒక మాట చెబుతాడు ఇది చాలా పెద్ద నెట్వర్క్.. వాళ్లు నిన్ను అసలు వదిలిపెట్టరు అంటూ హెచ్చరిస్తారు. ఆ నెట్వర్క్ గురించి జైలర్ సినిమాలో చిన్న చిన్న క్లూస్ కూడా ఇచ్చామని వాటి ఆధారంగా సీక్వెల్ రాబోతుందని సీక్వెల్ కూడా సరికొత్తగా ఉండబోతున్న నేపథ్యంలోనే తాను జైలర్ సీక్వెల్ సినిమాకు ఓకే చెప్పానని రజనీకాంత్ తెలిపారు.
ఇలా సీక్వెల్ సినిమాలు నచ్చకపోవడంతోనే ఇన్ని రోజులు రిజెక్ట్ చేస్తున్నట్టు రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక జైలర్ 2 సినిమా విషయానికి వస్తే సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాని నాగ వంశీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 15వ తేదీ ఈ సినిమా విడుదల అవ్వగా 16వ తేదీ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి(Ranabaali) సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతున్న సంగతి తెలిసిందే.
Also Read:పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!