Michael Clarke Praises Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై పొద్దున లేస్తే చాలు కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. టీమిండియాను సర్వనాశనం చేస్తున్నాడని… ఎవడు పడితే వాడి… జట్టులోకి తీసుకు వస్తున్నాడని ఫైర్ అవుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను మెచ్చుకుంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా కు గౌతమ్ గంభీర్ రూపంలో మంచి హెడ్ కోచ్ లభించాడని.. అతనికి దండేసి దండం పెట్టినా తప్పులేదంటూ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడు గౌతమ్ గంభీర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడే లేకపోతే టీమిండియా ప్లేయర్లతోపాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి రోడ్డున పడేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా స్టాండర్డ్స్ మొత్తం హై లెవెల్ కు వెళ్లాలని గుర్తు చేశారు. అలాంటోడిని ఎందుకు తిడుతున్నారని నిలదీశారు. దీంతో గౌతమ్ గంభీర్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన మన దేశపు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు బండబూతులు తిడుతుంటే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. మరుగున పడ్డ టాలెంట్ క్రికెటర్లను వెలికి తీసిన ఘనుడు అతడేనని మెచ్చుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2025, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లలో టీమిండియా చాంపియన్ గా నిలవడం వెనుక గౌతమ్ గంభీర్ పాత్ర 100కు 200 శాతం ఉందని వివరించారు. అలాగే టీమ్ ఇండియాలో యంగ్ క్రికెటర్లకు ఎక్కువగా అతడు అవకాశాలు ఇస్తున్నాడని వెల్లడించారు. రోహిత్ శర్మ తర్వాత గిల్ ను గుర్తించి కెప్టెన్సీ ఇప్పించాడని స్పష్టం చేశారు.
టి20 లలో సూర్య కుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్ కుర్రాడిని కెప్టెన్ చేసి తన మార్క్ వేసుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియాకు కుర్రాళ్లే కెప్టెన్లు ఉండాలని ముఖ్య లక్ష్యంతో అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడని వెల్లడించారు. అయితే యంగ్ కెప్టెన్లను చేయడం వల్ల రోహిత్ శర్మ అటు సూర్య కుమార్ యాదవ్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని స్పష్టం చేశారు. మాజీ క్రికెటర్లు కూడా గౌతమ్ గంభీర్ ను బండ బూతులు తిట్టారని పేర్కొన్నారు. ఒక మంచి పని చేసేటప్పుడు 100 అవమానాలు ఎదురవుతాయని… గౌతమ్ గంభీర్ నిర్ణయాలకు ఇలాంటి ఆటంకులు ఎన్నో ఎదురు అయ్యాయని వివరించారు. కానీ ఏమాత్రం వెనక్కి అడుగు వేయకుండా అతడు ముందుకు వెళ్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇదే ఊపుతో 2027 వన్డే వరల్డ్ కప్ కూడా టీమిండియా కు అందించే ఛాన్సులు ఉన్నాయని అంచనా వేశారు.