BigTV English

Coolie Film: హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్, అసలు మేటర్ ఏంటంటే?

Coolie Film: హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్, అసలు మేటర్ ఏంటంటే?

Coolie Film: ఆగస్టు 14న ఎన్నో అంచనాల మధ్య వచ్చి విడుదలైంది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాపై కొన్ని రోజులు ముందు నుంచి విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. దీనికి కారణం రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడం. అలానే లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడికి ఉన్న బ్రాండ్ కూడా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి కారణం. మొత్తానికి ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అలా అని చెప్పి ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు.


ఈ సినిమా బుకింగ్స్ చూసినప్పుడు ఖచ్చితంగా 1000 కోట్లు సాధిస్తుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. కానీ సినిమా రిలీజ్ అయి మొదటి షో పడిన వెంటనే డిఫరెంట్ టాక్ వచ్చింది. కానీ డిజాస్టర్ టాకు రాలేదు. సినిమా మీద కంప్లైంట్స్ ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

హైకోర్టును ఆశ్రయించిన కూలీ చిత్ర యూనిట్ 


ప్రస్తుతం కూలీ చిత్ర యూనిట్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. తమ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు, అది కాకుండా యు సర్టిఫికెట్ కావాలి అని ఆశ్రయిస్తున్నారు. ఇక ఏ సర్టిఫికేట్ రావటం వలన చాలా మంది చిన్న పిల్లలు సినిమా చూడటానికి అనుమతి లేకుండా పోయింది. ఏ సర్టిఫికెట్ రావడం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ రావడంతో చాలావరకు కలెక్షన్లు పడిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అవసరం ఉంది. 18 ఏళ్లు దాటితే గాని సినిమా థియేటర్లోకి ఎంట్రీ చేయడం లేదు. పలుచోట్ల చాలామందిని కూలీ సినిమా చూడకుండా ఆపేశారు. సినిమా అంటే పిల్లలతో పాటు వెళ్లి చూడాలి అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ పిల్లలకు అనుమతి లేదు. వాళ్లని ఇంటి దగ్గర విడిచిపెట్టి పేరెంట్స్ థియేటర్ రాలేరు. దీనివలన కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉంది.

ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం 

వాస్తవానికి ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ఏంటి అని పోస్టులు కూడా పెట్టారు. కానీ రీసెంట్ గా తమిళ్ సెన్సార్ బోర్డు రూల్స్ కంప్లీట్ గా మారిపోయాయి. ఆ రూల్స్ మారిన తర్వాత మొదట రిలీజ్ అయిన సినిమా కూలీ. ఆ రూల్స్ ప్రకారంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇకపై రాబోయే సినిమాలకి కూడా ఓన్లీ ఏ సర్టిఫికేట్ వస్తే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. మరి హైకోర్టు దీనికి ఎటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

 

Related News

Murali Naik Biopic: జవాన్ మురళి నాయక్ బయోపిక్ .. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్?

Cm Revanth Reddy: సీఎం ఇంట్లో సుకుమార్, ఊహించని పరిణామం

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Chandra Bose: ఆస్కార్ రచయితను బెదిరించిన సినిమా డైరెక్టర్

Anil Ravipudi : టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి, ఇక సంక్రాంతి లేనట్లేనా? 

Big Stories

×