BigTV English

OTT Movie : తన మాంసాన్ని తనే పీక్కుతినే పిల్లాడు… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్… ఒంటరిగా చూడకూడని సినిమా

OTT Movie : తన మాంసాన్ని తనే పీక్కుతినే పిల్లాడు… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్… ఒంటరిగా చూడకూడని సినిమా

OTT Movie : దెయ్యాలు ఉన్నాయో లేదో గాని, ఈ దెయ్యాలసినిమాలు మాత్రం భయపెట్టి చంపుతుంటాయి. ఇక మధ్యలో వచ్చే రిచ్యువల్స్ వెన్నులో వణుకుపుట్టిస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చూశాక నిద్ర అంత ఈజీగా పట్టదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక భయంకరమైన రిచ్యువల్ చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులకు సూపర్‌నా చురల్ భయాన్ని చూపిస్తుంది. ఒక తల్లి చనిపోయిన తన కూతుర్ని బతికించుకోవడానికి చేసే ఒక భయంకర రిచ్యువల్ తో ఈ కథ ముందుకు వెళ్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీ ఏమిటంటే

లారా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో నివసించే ఒక  సోషల్ వర్కర్. ఆమెకు కళ్ళు కనిపించని కాథీ అనే కుమార్తె ఉండేది. అయితే ఆమె ఒకరోజు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోతుంది. ఈ సంఘటన లారాను మానసికంగా కుంగదీస్తుంది. ఇది ఆమె విచిత్రమైన ప్రవర్తనకు దారితీస్తుంది. ఇప్పుడు లారా బయటికి మామూలుగానే కనిపించినా కానీ, లోపల ఆమె కాథీని తిరిగి బతికించికోవాలనే ఒక విపరీతమైన కోరికతో ఉంటుంది. ఈ పరిస్థితి ఆమెను బ్లాక్ మ్యాజిక్ ఆచారాల వైపు నడిపిస్తుంది. ఈనేపధ్యంలో ఆమె డార్క్ వెబ్ నుండి కొన్ని వీడియోలను సంపాదిస్తుంది. ఇవి ఒక భయంకరమైన రిచ్యువల్‌ను చూపిస్తాయి. ఒక శవాన్ని తినడం ద్వారా పునర్జన్మ సాధ్యమవుతుందని అందులో ఉంటుంది. లారా ఈ ఆచారాన్ని అనుసరించడానికి నిర్ణయించుకుంటుంది.


మరో వైపు ఈ స్టోరీ ప్రధానంగా 17 ఏళ్ల ఆండీ, అతని సోదరి పైపర్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ శాడిస్ట్ తండ్రి చనిపోవడంతో వీళ్ళు అనాథలుగా మారతారు. ఆండీకి 18 ఏళ్లు ఇంకా నిండలేదు, కాబట్టి వీళ్ళు లారా ఫోస్టర్ కేర్‌లోకి వెళతారు. అక్కడ ఆలివర్ అనే మూగ బాలుడు కూడా ఉంటాడు. లారా మొదట్లో మంచి మనిషిగా కనిపిస్తుంది. కానీ ఆతరువాత ఆమె ప్రవర్తన మీద ఆండీకి సందేహం కలుగుతుంది. ఆండీ తన 18వ ఏట నుంచి తన సోదరి పైపర్ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ లారా అతన్ని మానసికంగా హింసిస్తుంది. అతనికి మత్తు మందు ఇచ్చి మంచం మీద ఉండేలా చేస్తుంది. పైపర్‌పై దాడి చేసినట్లు అతని మీద నిందలు మోపుతుంది. ఇంతలో లారా సీక్రెట్ ఒకటి బయటపడుతుంది. ఆమె కాథీని తిరిగి బతికించుకోవడానికి ఆలివర్‌ను ఒక రిచ్యువల్ లో ఉపయోగిస్తోంది. ఈ ఆచారంలో మరణించిన వ్యక్తి శవాన్ని తినడం ద్వారా, చనిపోయిన వాళ్ళ ఆత్మ మరొక శరీరంలోకి బదిలీ అవుతుంది.

లారా ఇప్పుడు ఒక విలన్‌గా మారుతుంది. ఆమె ఆండీని మానసికంగా బలహీనపరుస్తుంది. పైపర్‌ను ఒంటరిగా ఉంచుతుంది. ఆలివర్‌ను బ్లాక్ మ్యాజిక్ కోసం ఉపయోగిస్తుంది. ఆమె పైపర్‌కు కాథీ బట్టలు వేయించి, ఆమెను కాథీ ఆత్మ కోసం హోస్ట్‌గా సిద్ధం చేస్తుంది. ఇప్పుడు లారా చేసే ఈ రిచ్యువల్ కి స్టోరీ భయంకరమైన మలుపు తీసుకుంటుంది. లారా తన కూతురి ఆత్మకు తిరిగి ప్రాణం పోస్తుందా ? ఈ రిచ్యువల్ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ? ఆండీ, తన చెల్లెలితో దీనినుంచి బయటపడతాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘బ్రింగ్ హర్ బ్యాక్’ (Bring her back) ఆస్ట్రేలియన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా. దీనికి, డానీ మైకేల్ ఫిలిప్పౌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాలీ హాకిన్స్ (లారా), బిల్లీ బరాట్ (ఆండీ), సోరా వాంగ్ (పైపర్), జోనాహ్ వ్రెన్ ఫిలిప్స్ (ఆలివర్) నటించారు. 2025 మే 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. Amazon Prime Video, Apple TVలో ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్, స్పానిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. 104 నిమిషాల ఈ సినిమా IMDb లో 7.2/10 రేటింగ్ పొందింది.

Read Also : వామ్మో… మనుషుల్ని చంపి మటన్ లా తినే భార్యాభర్తలు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కయాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

OTT Movie: అయ్యయ్యో ఈ లవ్ స్టోరీ మామూలుగా లేదే… ఎంట్రీనే ఊర మాస్… క్లైమాక్స్ ఊహించలేం

OTTMovie: బ్లాక్ మ్యాజిక్ తో దద్దరిల్లిన బాక్స్ ఆఫీస్… దేవుడనుకుని దెయ్యానికి పూజలు… ట్రైలర్ కే ప్యాంట్ తడిపించే సినిమా

OTT Movie : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

Mirai On OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిరాయ్.. అధికారిక ప్రకటన!

Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!

Big Stories

×