BCCI Betrays Country : ఆసియా కప్ 2025 సంబంధించి టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో సర్పంచ్ సాబ్..శ్రేయాస్ అయ్యర్ కి మాత్రం నిరాశ ఎదురైంది. అయితే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సెప్టెంబర్ 09 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ లు టీ-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాాజాగా ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ-20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమావేశమై 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను టీ-20 జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు. ఆసియా కప్ లో టీమిండియా లీగ్ దశ తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.
Also Read : SA vs Aus 1st ODI : ఆస్ట్రేలియాలో చిత్తుచిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా.. ఏకంగా 98 పరుగుల తేడాతో
ఐసీసీ చైర్మన్ జైషా వల్లనే..
సెప్టెంబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగకూడదని అభిమానులు పేర్కొంటే.. బీసీసీ మాత్రం జరుగుతుందని చెప్పకనే చెప్పింది. అయితే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జైషా వల్లనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇక దీనికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దారుణం. ఈ నేపథ్యంలో జైషా పై దేశ ద్రోహి అని.. జైషా డబ్బులకు కక్కుర్తి పడి పాకిస్తాన్ తో మ్యాచ్ జరిపిస్తున్నాడని రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఆసియా కప్ లీగ్ చివరి మ్యాచ్ లో 19న ఒమన్ తో భారత్ తలపడనుంది. ఇటీవల WCL మ్యాచ్ లో లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ తో ఆడలేదు. అలాగే సెమీస్ లో కూడా తలపడాల్సి వస్తే.. ఆ మ్యాచ్ నుంచి కూడా టీమిండియా జట్టు తప్పుకుంది. దీంతో నేరుగా పాకిస్తాన్ WCL లో ఫైనల్ కి వెళ్లింది. ఆసియా కప్ లో పలువురు సీనియర్ క్రికెటర్లు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ఆడకూడదని సూచిస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఆడాలని నిర్ణయించుకుంది. ఆసియా కప్ లో గ్రూప్ ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనున్నాయి.
దేశమే ముఖ్యం..
ఇక గ్రూప్ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు పోటీ పడుతాయి. ఒకే గ్రూపు ఉన్న దాయాదులు భారత్ – పాక్ జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబర్ 14న తొలిసారి తలపడుతాయి. ఆ తరువాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మొత్తం మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను దృష్ట్యా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో క్రీడల్లో ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. WCL లీగ్ మ్యాచ్, సెమీ ఫైనల్ మ్యాచ్ లను బహిష్కరించి దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చి చెప్పింది. ఇక ఆసియా కప్ టోర్నీలో మాత్రం జైషా కారణంగా చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా పోటీపడే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Tag @BCCI and use #DeshdrohiBCCI — they are ready to play against Pakistan, putting money above the nation. For @JayShah, profit comes before patriotism. @PMOIndia and @HMOIndia remain silent while BCCI betrays the country. They’ve sold their souls for money."#TeamIndia Gill pic.twitter.com/3IJhPT1lv0
— Meenakshi (@ImMeenakshi22) August 19, 2025