Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 9 సీజన్లు పూర్తికాగా, 10వ సీజన్ ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతోంది. ఊహించని కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.అందులో భాగంగానే మొదటివారం చైత్ర, రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ కాగా, మూడవ వారం బిగ్ బాస్ తీసుకొచ్చిన సూట్ కేస్ ఆఫర్ ను తీసుకొని మిథిలేష్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ అయ్యింది.
ఐదవ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది. అయితే బిగ్ బాస్ 10 హౌసులో ఈ నామినేషన్ ప్రక్రియ సెగలు పుట్టిస్తోందనే చెప్పాలి. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం ఒక ఎత్తైతే.. అందరూ ఆమెనే టార్గెట్ చేయడం మరో ఎత్తు. ముఖ్యంగా అపూర్వ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ.. నామినేట్ చేస్తుంటే, నిజాయితీకి ఆమె అడ్డంకిగా మారుతోందా అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . మరి ఈ నామినేషన్స్ ప్రక్రియ ఎలా సాగిందో లేటెస్ట్ ప్రోమోలో విడుదల చేశారు.
అగ్నిపరీక్ష సీజన్ 2 లో చురుకుదనంతో చలాకీగా అందరి దృష్టిని ఆకట్టుకున్న అపూర్వ.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి వారమే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి అందరిని ఆకట్టుకుంది. ఐదవ వారం నామినేషన్ లో చాలామంది అపూర్వ ను టార్గెట్ చేయడం వైరల్ గా మారింది. తాజాగా ఇచ్చిన టాస్క్ విషయానికి వస్తే.. ఒక గుమ్మడికాయను.. ఎదురుగా ఉన్న బాక్సుల కింద ఎక్కడో ఒకచోట దాచిపెట్టి , ఇద్దరేసి కంటెస్టెంట్లను పిలుస్తారు. ఆ ఇద్దరిలో ఎవరు గుమ్మడికాయని ముందుగా దక్కించుకుంటారో.. వారికి నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. నామినేషన్ చేసే కంటెస్టెంట్ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి , వారి ముందు ఉంచిన దిష్టిబొమ్మల కుండను పగలగొట్టాల్సి ఉంటుంది. దీంతో నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల కు తమ కారణాలను చెప్పడంతో పాటు తమ కోపాన్ని కూడా బయటపెట్టే అవకాశం లభించింది.
ముందుగా రాంప్రసాద్ అమన్ ను నామినేట్ చేసినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. గతంలో త్రిగుణ్ కు ఆటలో గాయమైన ఘటనను ప్రస్తావించాడు.ఆ ఘటనను గుర్తు చేస్తూ అమన్ పై రామ్ చరణ్ తీవ్రంగా ఫైర్ అయినట్టు చూపించారు. ముఖ్యంగా రాంప్రసాద్ ఆరోపణలకు అమన్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ముఖ్యంగా త్రిగుణ్ కి సంబంధించిన విషయం కావడంతో అతడు కూడా ఈ వాదనలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.
also read:సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!
మరోవైపు ముఖేష్ , అపూర్వను నామినేట్ చేసినట్లు ప్రోమోలు చూపించారు. గతవారం ఆమె కెప్టెన్ గా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరును చెప్పి నామినేట్ చేశారు. కెప్టెన్ గా ఉన్న సమయంలో అపూర్వ ఓవరాక్షన్ చేసిందని, పొగరుగా వ్యవహరించిందని ఆరోపించారు. పైగా గతవారం జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ.. నామినేట్ చేశారు ముఖేష్. నామినేషన్ సమయంలో జరిగిన చర్చలలోకి వర్షిణి కూడా ఎంట్రీ ఇచ్చింది. గతంలో అపూర్వ తనను తిట్టిన విషయాన్ని కూడా వర్షిణి ప్రస్తావించింది. దీనికి తోడు నాగార్జున కూడా డిజాస్టర్ కెప్టెన్ అని అపూర్వను పిలవడంతో ఈ విషయాన్ని కూడా గుర్తు చేసింది వర్షిణి. త్రిగుణ్ కూడా అపూర్వను నామినేట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే అపూర్వ పైనే కంటెస్టెంట్స్ తమ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో చూపించారు.