E-Paper
Advertisement

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Supreme Court: మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వికృత మనస్తత్వమున్న వ్యక్తులకు చట్టం, పోలీసులంటే చావు భయం పుట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం వంటి తప్పులు చేస్తే చచ్చిపోతామన్న భయం నేరస్థుల్లో కలిగినప్పుడే మహిళలపై జరిగే దారుణాలను అరికట్టగలమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో దేశ రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సహా వరుస దారుణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘కళాశాలల వద్ద కట్టుదిట్ట భద్రత’

నేరాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విద్యార్థినులను వేధించే పోకిరీల ఆటకట్టించేందుకు కళాశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. అలాగే ఢిల్లీ వ్యాప్తంగా అక్రమంగా నడుస్తున్న ఈటరీలు (ఆహారం, మద్యం దొరికే ప్రదేశాలు), దాబాలపై వెంటనే దృష్టి సారించాలని తెలిపింది. ఇలాంటి అక్రమ కేంద్రాలే అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయని అక్కడ మద్యం సేవించి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

నిర్భయ ఘటనను గుర్తుచేసిన కోర్టు

Advertisement

దక్షిణ ఢిల్లీలోని ఒక గర్ల్స్ కాలేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను జస్టిస్ జేబీ పార్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తావించింది. ‘ఆ నిందితుల ప్రవర్తన గురించి ప్రజలు ముందుగానే హెచ్చరించినా పోలీసులు ఎందుకు అప్రమత్తం కాలేదు?’ అని ప్రశ్నించింది. 2012 నాటి దారుణమైన ‘నిర్భయ’ ఘటనను గుర్తుచేస్తూ ఆ కేసులోని నేరస్థులు కూడా దాడికి దిగే ముందు మద్యం సేవించి ఈటరీల్లో తిరిగారని న్యాయస్థానం గుర్తుచేసింది.

Also Read: బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

మహిళల కోసం ప్రత్యేక వార్ రూమ్స్

Advertisement

ఢిల్లీలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని, లైంగిక నేరస్థుల జాతీయ డేటాబేస్ (NDSO) ద్వారా అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచాలని కోర్టు సూచించింది. రాబోయే నాలుగు వారాల్లో ఇలాంటి దారుణాలు మళ్లీ రిపీట్ కాకూడదని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజల నుంచి లేదా ఇతర వర్గాల నుంచి నిరసనలు ఎదురైనా వెనక్కి తగ్గవద్దని, మహిళల భద్రత కోసం పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది. ‘మనమందరం కలిసి పనిచేస్తేనే ఈ వికృత నేరాలకు ముగింపు పలకగలం’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Also Read: Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

Tags

Related News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Big Stories

Advertisement
×