Ram Charan: బుచ్చిబాబుపై రామ్ చరణ్ (Ram Charan)కు డౌట్ అనగానే, ‘పెద్ది’ సినిమా కూడా డౌటేనా? అని కంగారు పడతారేమో? అలాంటిదేమీ లేదు. ‘పెద్ది’ (Peddi Movie) ఎప్పుడు వచ్చినా రికార్డులు షేకవడం ఖాయం అనేలా చిత్రయూనిట్ ధీమాగా ఉంది. మరి తేడాగా సంగతి విషయానికి వస్తే.. ఏం లేదు.. ఇటీవల ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ (Chikiri Chikiri Song) ఇలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట విడులైన మొదటి రోజు నుంచి సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంది. కొన్ని చోట్ల అయితే రికార్డులు కూడా బద్దలయ్యాయి. అలా దూసుకెళ్లింది ఈ పాట. అసలు ఎక్కడ విన్నా ఈ పాటే. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఇంకా దుమ్మురేపుతున్న ఈ సాంగ్ గురించి తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబుల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణే ఈ ‘డౌట్’ మ్యాటర్.
Also Read- Manchu Vishnu: దుబాయ్‌లో పరిస్థితిపై మంచు విష్ణు కీలక పోస్ట్.. అంతా సేఫేనా?
అసలు విషయం ఏమిటంటే.. తాజాగా ‘పెద్ది’ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ వీడియోను వదిలారు. ఈ వీడియోలో డబ్బింగ్ చెబుతూ.. ‘ఏమది’ అని చరణ్ అంటున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే.. అసలు విషయాలు బయటకొచ్చాయి. డబ్బింగ్ అనంతరం బుచ్చితో సరదాగా రామ్ చరణ్ ముచ్చటించారు. ‘‘బుచ్చి (Buchi Babu Sana), మోహిత్ చౌహాన్ పాడిన చికిరి చికిరి పాటలో ఆయన వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే, నువ్వు పాడావా? లేక ఆయనే పాడాడా? అనే డౌట్ వచ్చిందయ్యా. నాకు డబ్బింగ్‌లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి. ఆ పాట పాడుతంటే.. నేను ఫీలవ్వాలా? లేక ఆయన ఫీలవుతున్నాడా? అని మోహిత్ రియాక్షన్ ఉంది’’ అంటూ సరదాగా నవ్వుకుంటున్న వీడియోను రామ్ చరణ్ షేర్ చేశారు. అదన్నమాట అసలు ‘డౌట్’కి కారణం. అంతేకానీ, సినిమానే డౌట్ అని మాత్రం అనుకోవద్దు.
Also Read- Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ పరంగా ఇప్పటికే సంచలనాన్ని సృష్టిస్తోందీ చిత్రం. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరికి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి. మార్చి 2న ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాటతో మరోసారి సోషల్ మీడియాను చరణ్ షేక్ చేయబోతున్నాడంటూ.. అప్పుడే ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
Buchi…. naku oka doubt!
'RAI RAI RAA RAA…' annav kada?
Eppudu ostunav mari 😉?Eesari song nuvve paadtunava?
Twaraga ocheyi… Thala Fans waiting ikkada.. 😁@BuchiBabuSana #Peddi pic.twitter.com/wP0PHwhdeF— Ram Charan (@AlwaysRamCharan) March 2, 2026
Also Read- Allu Sirish: అల్లు శిరీష్ సినీ ప్రస్థానం బాలీవుడ్ తో మొదలైందా..ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?