E-Paper
Advertisement

Manchu Vishnu: దుబాయ్‌లో పరిస్థితిపై మంచు విష్ణు కీలక పోస్ట్.. అంతా సేఫేనా?

Manchu Vishnu: దుబాయ్‌లో పరిస్థితిపై మంచు విష్ణు కీలక పోస్ట్.. అంతా సేఫేనా?
Advertisement

Manchu Vishnu: ఇరాన్ ఇజ్రాయిల్ మద్య గత నాలుగు రోజులుగా భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు జరగడంతో గల్ఫ్ దేశాలలోని ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇక ఈ గల్ఫ్ దేశాలలో మన భారతీయులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడం వీడియోలను షేర్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు తన కుటుంబంతో దుబాయిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

దుబాయిలో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ..

తన ఫ్యామిలీతో దుబాయ్ లో ఉన్న సమయంలో తన తలపై నుంచి క్షిపణి వెళ్లడంతో భయాందోళన పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఇలాంటి వాతావరణంలో పిల్లలు పెరగకూడదు అంటూ ఈయన అక్కడి పరిస్థితులను వివరిస్తూ పోస్ట్ చేశారు. దీంతో మంచు అభిమానులు ఈ విషయంపై కంగారు వ్యక్తం చేస్తూ విష్ణు కుటుంబానికి ఏం కాకూడదని క్షేమంగా ఇండియా తిరిగి రావాలని ప్రార్థించారు . ఇక మంచు లక్ష్మి సైతం తన తమ్ముడి కోసం ప్రార్థనలు చేయమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నా కుటుంబం సురక్షితం..

Advertisement

తాజాగా మంచు విష్ణు చేసిన పోస్ట్ చూస్తుంటే అభిమానుల ప్రార్థనలు ఫలించాయని తెలుస్తుంది. తాజాగా మంచు విష్ణు దుబాయ్ లోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మా భద్రత గురించి ఆలోచిస్తూ మా క్షేమాన్ని కోరుకొని మెసేజ్ లు ఫోన్ కాల్స్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దుబాయ్ లో నేను నా కుటుంబం చాలా సురక్షితంగా ఉన్నాము. అప్పుడప్పుడు దూరంగా పెద్ద శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయని ఇక్కడ మాత్రం ప్రశాంతకరమైన వాతావరణ పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి క్లిష్టతర పరిస్థితులలో దుబాయ్ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలపై కూడా మంచు విష్ణు ప్రశంసలు కురిపిస్తూ UAE అధికారులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

మంచు విష్ణు దుబాయ్ లోని పరిస్థితి గురించి తెలియజేస్తూ తాము క్షేమమని పోస్ట్ చేయడంతో మంచు కుటుంబం సేఫ్ అయిందనే విషయం తెలిసి అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ లో పరిస్థితులు చక్కబడటంతో త్వరలోనే మంచు విష్ణు కుటుంబం ఇండియాకు తిరిగి రాబోతున్నారు.ఇక మంచు విష్ణు సినీ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈయన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సినిమా పర్వాలేదనపించుకుంది. ఈ సినిమా తర్వాత మంచు విష్ణు తదుపరి ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు.

Also Read: Allu Sirish: అల్లు శిరీష్ సినీ ప్రస్థానం బాలీవుడ్ తో మొదలైందా..ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×