BigTV English

OTT Movie : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా

OTT Movie : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా

OTT Movie : కామెడీ జానర్ లో వచ్చే సినిమాలను అందరూ చూస్తుంటారు. కొన్ని సినిమాలైతే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా, 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ హిందీ చిత్రం అవార్డును కూడా గెలుచుకుంది. ఈ స్టోరీ ఒక విచిత్రమైన పనసకాయల చోరీ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇది 2014లో ఢిల్లీలో ఒక రాజ్యసభ సభ్యుడి ఇంటి నుండి పనసకాయలు దొంగిలించబడిన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకివెళితే …


కథలోకి వెళ్తే

మోబా అనే ఊరిలో, ఇన్‌స్పెక్టర్ మహిమా బసోర్ అనే ఒక మహిళా పోలీసు అధికారి విధులు నిర్వహిస్తుంటుంది. మహిళలపై జరిగే నేరాలను పరిష్కరించడంలో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం కూడా ఉంది. అయితే ఆమె కులం వల్ల, సహోద్యోగుల నుండి వివక్షను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మున్నాలాల్ పటేరియా ఇంటి తోటలో రెండు విదేశీ రకం పనసకాయలు దొంగిలించబడతాయి. ఈ కేసును పరిష్కరించే బాధ్యత మహిమాకు అప్పగించబడుతుంది. ఈ పనసకాయలు ఎమ్మెల్యేకు రాజకీయంగా ముఖ్యమైనవి. ఎందుకంటే అతను వాటితో చేసిన ఊరగాయలతో పార్టీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. మహిమా ఈ కేసును విచిత్రంగా భావిస్తుంది. కానీ ఆమె సీనియర్ ఎస్పీ అంగ్రేజ్ సింగ్ రంధావా ఒత్తిడితో దర్యాప్తు ప్రారంభిస్తుంది.


ఆమె ప్రియుడు, కానిస్టేబుల్ సౌరభ్, తన తండ్రి కుల ఆధారిత అభ్యంతరాల వల్ల వారి సంబంధాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దర్యాప్తులో, మహిమా ఎమ్మెల్యే యొక్క తోటమాలి బిర్వాను ప్రధాన అనుమానితుడిగా గుర్తిస్తుంది. అతను ఇటీవల ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. బిర్వా తన కూతురు అమియా కనిపించట్లేదని ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వస్తాడు. కానీ సౌరభ్ ఆ ఫిర్యాదును నిర్లక్ష్యం చేస్తాడు. మహిమా ఈ కేసును అమియా మిస్సింగ్ కేసుకు లింక్ చేసి, బిర్వాను అమియానే పనసకాయలు దొంగిలించిందని చెప్పమని ఒప్పిస్తుంది. దీని ద్వారా ఆమె అమియా మిస్సింగ్ కేసును పరిశోధించడానికి అవకాశం పొందుతుంది.

Read Also : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

స్థానిక జర్నలిస్ట్ అనుజ్ మోబాలో 43 మంది అమ్మాయిలు మాయమైన సమాచారాన్ని మహిమాకి ఇస్తాడు. ఇది మహిమాకు ఒక ఆధారంగా మారుతుంది. సౌరభ్ ఫోన్ రికార్డుల ద్వారా అమియాను కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులను గుర్తిస్తాడు. మహిమా వారిని ఛత్తర్‌పూర్‌లోని గులాబ్ సేఠ్ వద్దకు ట్రాక్ చేస్తుంది. ఒక ఫైట్ సీన్ తర్వాత, మహిమా అమియాను రక్షిస్తుంది. కోర్టులో మహిమా పనసకాయల కేసు కంటే, మానవ జీవితాలు ముఖ్యమని వాదిస్తుంది. అమియా నిర్దోషిగా విడుదలవుతుంది. చివరలో పనసకాయలను కోతులు దొంగిలించినట్లు ఒక సీన్‌లో చూపిస్తారు. ఇలా ఈ స్టోరీ వ్యంగ్యాత్మకంగా ముగుస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘కత్తల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ’ (Kathal : A Jack Fruit Mystery) ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగే కామెడీ సినిమా. యశోవర్ధన్ మిశ్రా దీనికి దర్శకత్వం వహించారు. సాన్యా మల్హోత్రా, అనంత్ వి జోషి, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, నేహా సరాఫ్, గుర్‌పాల్ సింగ్ ప్రధానపాత్రల్లో నటించారు. 115 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2023 మే 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, IMDbలో 6.7/10 రేటింగ్ సాధించింది.

Related News

OTT Movie : తాగుబోతుకు గుడ్ డే… మైకంలోనే కేసును సాల్వ్ చేసే మతలబు… ఐఎండీబీలో రేటింగ్ 8 ఉన్న తమిళ మూవీ

OTT Movie: ఫ్రెండ్‌ను ఆవహించి.. 7 రోజులు గత్తరలేపే దెయ్యం.. ఇండోనేషియాలో రికార్డులు బ్రేక్ చేసిన హార్రర్ మూవీ ఇది

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×