E-Paper
Advertisement

ఏఐ వస్తే నాయకుల ఆట క్లోజ్ అంటున్న ఆర్జీవీ!

ఏఐ వస్తే నాయకుల ఆట క్లోజ్ అంటున్న ఆర్జీవీ!
Advertisement

Ram Gopal Varma Shocking Prediction: రామ్ గోపాల్ వర్మ… మొన్నటికి మొన్న AI తో డిగ్రీ సర్టిఫికెట్లు చిత్తు కాగితాలుగా మారిపోతాయి అని వార్నింగ్ ఇచ్చిన ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ ఇపుడు మరోసారి సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.ఈసారి ఆయన టార్గెట్ చేసింది దేన్నో కాదండోయ్ ..పొలిటికల్ సిస్టమ్ ని. అవును … ఇంకొన్నేళ్లలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేసేస్తుందని.. అప్పటికి వాళ్ల అవసరమే ఉండదని బాంబు వదిలాడు. ఇదిగో  ఈ కామెంట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎవరు ఫోన్ చేసినా వినదు..

Advertisement

వర్మ మాట్లాడుతూ  స్వార్థం  భయం, బదిలీ అవుతామనే టెన్షన్, రాజకీయ ఒత్తిళ్లు, డబ్బు మీద ఆశ వంటివి ఏవీ AI కి ఉండవని సో ఆటోమాటిక్ గా మనుషులలో ఉండే ఈ లోపాలని అదనుగా చేసుకుని వారి స్థానాలకి ఎసరు పెడుతుంది అని చెప్పుకొచ్చాడు.AI అసలు “ఎవరు ఫోన్ చేసినా వినదు.. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా లొంగదు.. ఎవరు ఎంత డబ్బు ఆఫర్ చేసినా తీసుకోదు.. కాబట్టి అది తీసుకునే నిర్ణయాలు కూడా ఫెయిర్‌గా ఉంటాయి”అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ఇక ఇప్పుడున్న రాజకీయాల్లో డేటా కూడా తమకు నచ్చినట్టు వాడుకుంటున్నారని ఆయన సెటైర్ వేశారు. రైతుల సమస్యలైనా.. వర్షాల పరిస్థితులైనా.. ధరల పెరుగుదలైనా.. ఎవరి లెక్క వాళ్లు చెబుతున్నారని అన్నారు. కానీ ఏఐ మాత్రం శాటిలైట్ డేటా, వాతావరణ సమాచారం, మార్కెట్ రేట్లు, గత రికార్డులు అన్నీ ఒకేసారి చూసి అసలు నిజం ఏంటో చెప్పేస్తుందని కుండ బద్దలు కొట్టేశారు.

Advertisement

ఉదాహరణగా దుబాయ్‌

ఇదే క్రమం లో దుబాయ్‌ను ఎగ్జాంపుల్ గా చెబుతూ అక్కడ ఇప్పటికే కొన్ని స్మార్ట్ పోలీస్ స్టేషన్లు మనుషుల జోక్యం లేకుండానే సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశాడు.ఇలాంటి టెక్నాలజీ రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల్లోకి వస్తుందని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏఐ కీలకంగా మారుతుందని చెప్పాడు.

అయితే కొంతమంది మాట్లాడుతూ దేశాన్ని నడిపేది కేవలం కంప్యూటర్లు కాదని.. ప్రజల సమస్యలు, భావోద్వేగాలు, పరిస్థితులు అర్థం చేసుకునే నాయకత్వం కూడా అవసరమేనని కౌంటర్ వేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా లాస్ట్ డిసీషన్  మాత్రం మనుషులదే కావాలని అంటున్నారు.

నిజానికి వర్మ చెబుతున్న దాంట్లో లాజిక్ ఉంది .ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, ట్రాఫిక్ కంట్రోల్, పోలీసింగ్.. ఇలా ఒక్కో రంగంలో ఏఐ ఎన్నో ఉద్యోగాలకి ఎసరు పెట్టేస్తుంది.ఏమో ముందు ముందు వర్మ అన్నట్టుగా పొలిటికల్ సిస్టం లోకి కూడా AI చొచ్చుకుపోవచ్చు.ఇప్పటి వరకు దూసుకొచ్చిన ఈ AI భూతాన్ని ఎవరు ఊహించారు కనుక !

also read :భాగవతం కథతో పాన్ ఇండియా ప్లాన్.. ఏకంగా 7 సినిమాలు!

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×