E-Paper
Advertisement

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!
Advertisement

RGV AI: రామ్ గోపాల్ వర్మ..వివాదం నా ఇంటి పేరు అంటూ సొసైటీలో ఏం జరిగినా తనదైన రియాక్షన్ వదులుతూ మీడియాలో తెగ హైలెట్ అవుతుంటాడు.ఈ క్రమంలోనే ముంచుకొస్తున్న AI పై గట్టి వార్నింగ్ ఇచ్చాడు.మీరంతా నీట్ పేపర్ లీక్ అయిందని తెగ బాధ పడిపోతున్నారు. అదసలు సమస్యే కాదు అసలు సమస్య AI అంటూ తేల్చి చెప్పాడు.మీరు కాని అలర్ట్ అవకపోతే మీపీకల్ని కొరికేసే రాక్షసుడు ఆ AI నే అంటూ కుండబద్దలు కొట్టేశాడు.

1984లో వచ్చిన ‘టెర్మినేటర్’ సినిమాలో స్కైనెట్ వచ్చి మనుషులపై ఎలాంటి పెత్తనం చేసిందో మనం చూశాం.ఇక  1999లో వచ్చిన ‘ది మ్యాట్రిక్స్’ సినిమాలో యంత్రాల చేతిలో మనుషులు బానిసలవడం కూడా మనకి తెల్సిందే.ఇదిగో ఇప్పుడు సరిగ్గా అదే సీన్ మన చదువులకు, ఉద్యోగాలకు ఎదురుకాబోతోందని  తన తాజా పోస్ట్‌లో తేల్చి చెప్పాడు రాము.

Advertisement

వాళ్ళ భవిష్యత్తు ఇక ‘కసాయి ఖానా’నే

2022 చివర్లో ‘చాట్ జీపీటీ’ వచ్చినప్పటి నుంచి టెక్నాలజీ ఏ రేంజ్‌లో మారిపోతుందో మనకి తెల్సిందే..అలాంటిది ఇంకా లక్షలకు లక్షలు ఫీజులు కట్టి, రాత్రింబవళ్లు నిద్రలేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ అని చదువుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఇక ‘కసాయి ఖానా’నే అంటూ ఘాటుగా పోల్చాడు.కష్టపడి ఐదారేళ్లు చదివి ఆ డిగ్రీ చేతికి తీసుకునే సరికి,అది కేవలం ఒక వేస్ట్ కాగితం అయిపోతుందని  చెప్పుకొచ్చాడు.

Advertisement

also read :జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!

వచ్చే రోజుల్లో అంతాAIనే 

అసలే ఇపుడు ఉద్యోగాలు లేక  విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కళ్ళారా కనిపిస్తూనే ఉంది.ఇక ముందు ముందు వారికి రావాల్సిన ఎన్నో పనులన్నీ ఏఐ కబ్జా చేసేలానే ఉంది.ఒకప్పుడు డాక్టర్, లాయర్, ఇంజినీర్ ..ఇలా ఒక్కొరు ఒక్కో ప్రొఫెషన్  లో ఉండేవారు.. కానీ రాబోయే రోజుల్లో ఏఐ వాడకం తెలిసిన ఒకే ఒక్కడు..వీళ్లందరి పనులను ఒక్కడే, చిటికెలో,పక్కాగా చేసేస్తాడు అన్నది రామ్ గోపాల్ వర్మ వాదన.నిజానికి అది నిజం కూడా.ఇప్పటికే మనిషి మెదడు ఊహించలేనంత వేగంగా డేటాను అనాలసిస్ చేసి జబ్బులను చెప్పడం దగ్గర్నుంచి,లీగల్ కాంట్రాక్టులు రాయడం, కోడింగ్, ఆడిటింగ్ వరకు అంతా ఏఐనే  చూసుకుంటుంది మరి.

మన  విద్యా వ్యవస్థలు గ్రహిస్తే మంచిది

దీనికి ఉన్న మరో ఎసెట్ ఏంటంటే మనుషుల్లా ఏఐకి నిద్ర అక్కర్లేదు, సాలరీ పెంచమని అడగదు, సండే హాలిడేస్ అడగదు, పైగా ఒకసారి చేసిన తప్పును మళ్లీ అస్సలు చేయదు. రీసెంట్‌గా ‘డెవిన్’ అనే ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక్కటే ఒక ప్రాజెక్ట్ మొత్తం కోడింగ్ రాయడం, ‘మిడ్ జర్నీ’ లాంటి టూల్స్ సెకన్లలో పని అంతా కంప్లీట్ చేయడం  మనం కళ్లారా చూస్తున్నాం కూడా.

సో ..ఆర్జీవి చెప్పినట్టుగా పాతకాలపు సిలబస్‌లు, బట్టీ చదువులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పట్టుకొని వేలాడటం కన్నా ఇప్పటి నుండే AI కి దీటుగా, AI తో ఎలా పనిచేయించాలో నేర్చుకోవడం, AI మీద కమాండింగ్ తెచ్చుకోవడమే ఇపుడు యువతకి అన్నింటి కన్నా ముఖ్యమని విద్యా వ్యవస్థలు గ్రహిస్తే మంచిది.

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×