E-Paper
Advertisement

రామ్ డైరెక్షన్‌లో ఫస్ట్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

రామ్ డైరెక్షన్‌లో ఫస్ట్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?
Advertisement

Ram Pothineni: టాలీవుడ్‌లో తన ఎనర్జీతో కుర్రకారును ఊపేసే హీరో రామ్ పోతినేని ఇప్పుడు ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నటుడిగా, డ్యాన్సర్‌గా థియేటర్లలో ఈలలు వేయించిన రామ్,ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు.

2006లో ‘దేవదాసు’ సినిమాతో చాక్లెట్ బోయ్‌గా ఎంట్రీ ఇచ్చిన రామ్, సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జగడం’తో ఫ్లాప్ మూటగట్టుకున్నా మంచి పేరే సంపాదించాడు. ఆ తర్వాత ‘కందురీగ’, ‘నన్ను శైలజ’ వంటి హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఇక పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేశాడో చెప్పక్కర్లేదు.

Advertisement

ఆ తర్వాత ‘రెడ్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఆంద్రా కింగ్ తాలుకా అంటూ వరుస ప్లాప్ సినిమాలని మూట గట్టుకున్న సంగతి తెల్సిందే.ఇక ఈ క్రమంలో హిట్ ట్రాక్ ఎక్కేస్తానంటూ ఏకంగా ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్దమైపోయాడు.

“Eka – The Lone Wolf” (ఏక – ది లోన్ వోల్ఫ్)

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి “Eka – The Lone Wolf” (ఏక – ది లోన్ వోల్ఫ్) అనే ఊరమాస్ టైటిల్‌ను పెట్టబోతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఒక్కడే వచ్చి డామినేషన్ చెలాయించే పవర్ ఫుల్ క్యారెక్టర్‌కి, రామ్ మార్క్ మేనరిజమ్‌కి ఈ టైటిల్ పక్కాగా సూట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయిపోయారు రాపో ఫ్యాన్స్ .

Advertisement

ఇక ఈ సినిమా విజువల్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి.విక్రమ్’, ‘ఖైదీ’ సినిమాలకు బిజిఎమ్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన శ్యామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. దీంతో
రీసెంట్‌గా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ మ్యూజిక్ అప్పుడే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక ఇండియాలోనే టాప్ కెమెరామెన్లలో ఒకరైన తిరు విజువల్స్ అందిస్తుండగా, యాక్షన్ సీక్వెన్సులు వేరే లెవెల్‌లో ఉండటానికి స్టార్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ మూవీకి కొరియోగ్రఫీ చేస్తున్నారు.

రామ్ సొంత బ్యానర్ ‘RaPo Cinematic’ పై నిర్మాణం 

ఈ భారీ విజువల్ వండర్‌ను రామ్ సొంత బ్యానర్ ‘RaPo Cinematic’ పై కృష్ణ పోతినేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రతి సీన్‌ను హాలీవుడ్ రేంజ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారట. లవర్ బోయ్‌గా, మాస్ హీరోగా అలరించిన రామ్, ఇప్పుడు ‘డైరెక్టర్ కమ్ యాక్టర్’గా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

also read :‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?

ఈ ‘ఏక – ది లోన్ వోల్ఫ్’ టైటిల్‌పై త్వరలోనే రామ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.చూడాలి మరి ఎన్నో సినిమాలు చేస్తున్నా రాణి సక్సెస్ ఈ సినిమా తో అయినా వస్తుందో లేదో !

Tags

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×