Tanveer Ahmed On IND VS SL: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( TEam India Vs Srilanka) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలి వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ తాజాగా జరిగింది. ఐదు రోజులపాటు జరిగిన ఈ తొలి టెస్ట్ లో టీమిండియా బ్రహ్మాండమైన విక్టరీ నమోదు చేసుకుంది. శ్రీలంక పై ఏకంగా 165 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. అయితే టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కుట్ర చేసి శ్రీలంకను టీమిండియా ఓడించిందని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇది గెలుపే కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా ( Sri Lanka vs. Team India ) మధ్య ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన తొలి టెస్ట్ ఇవాళ ముగిసింది. ఇందులో 165 పరుగులు తేడాతో టీమిండియా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా విక్టరీని కించపరిచేలా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు అనుకూలంగా ఉండేలా స్పిన్ ట్రాక్ సిద్ధం చేశారని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా అవలీలాగా శ్రీలంక పైన గెలిచిందని బాంబు పేల్చారు. మానవ్ సుతార్ ఆరు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో తీయడం వెనుక కుట్ర కోణం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్క సారిగా పిచ్ ను స్పిన్ కు అనుకూలంగా మార్చారని బాంబు పేల్చారు. అందుకే మానవ్ సుతార్ 6 వికెట్లు తీసి శ్రీలంకను ఓడించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే అసలు శ్రీలంక ఓడిపోయేది కాదని… ఈ మ్యాచ్ డ్రా కావలసి ఉందని తెలిపారు. కావాలనే ఐసీసీ కుట్రలు చేసి, శ్రీలంకను ఓడించిందని ఆరోపణలు చేశారు. జై షా ప్లాన్ చేసి మరీ, టీమిండియాను గెలిపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించే దిశగా జై షా స్కెచ్ లు వేస్తున్నారన్నారు.
శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య గాలే వేదికగా తొలి టెస్ట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయక 462 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులతో రెచ్చిపోయింది. అటు శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో తొలి టెస్టులో భారత్ చేతిలో లంక ఓడిపోయింది.