E-Paper
Advertisement

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!
Advertisement

Truecaller Scam Checker: మన ఫోన్‌కి ప్రతిరోజూ తెలియని నంబర్ల నుంచి కాల్స్, అనుమానాస్పద మెసేజ్‌లు, గుర్తు తెలియని లింకులు వస్తూనే ఉంటాయి. వాటిలో ఏది నిజమైనదో, ఏది సైబర్ నేరగాళ్లు వేసిన వలో గుర్తించడం అంత సులభం కాదు. ఒక్క పొరపాటుతో లింక్‌పై క్లిక్ చేసినా లేదా మోసపూరిత కాల్‌ను నమ్మినా వ్యక్తిగత సమాచారం, డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కాలర్ ఐడీ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్ భారతీయ వినియోగదారుల కోసం ‘స్కామ్ చెకర్’ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా అనుమానాస్పద లింకులు, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లను ఒకే చోట సులభంగా చెక్ చేసుకుని అవి సురక్షితమైనవో, మోసానికి సంబంధించినవో తెలుసుకోవచ్చు.

ఒకే చోట మూడంచెల తనిఖీ..

సాధారణంగా ఏదైనా కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు లేదా లింక్ చూసినప్పుడు అది సేఫ్‌ కాదో తెలుసుకోవడానికి వేర్వేరు యాప్‌లలో సెర్చ్ చేస్తుంటాం. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా ట్రూకాలర్ స్కామ్ చెకర్ ఈ ప్రక్రియను చాలా సులభం చేసింది. మీకు వచ్చిన లింక్‌ను ఇందులో పేస్ట్ చేసి అది మోసపూరితమైన ఫిషింగ్ యత్నమో కాదో వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే అనుమానాస్పద ఫోన్ నంబర్ల గురించిన పూర్తి వివరాలను ట్రూకాలర్ నెట్‌వర్క్ సహాయంతో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

Advertisement

Also Read: ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

కమ్యూనిటీ ఆధారిత సమాచారం..

ఈ ఫీచర్ కేవలం సాంకేతికతపైనే కాకుండా ట్రూకాలర్‌కు ఉన్న కోట్లాది మంది వినియోగదారుల అనుభవంపై కూడా ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ఉన్న ‘స్కామ్‌ఫీడ్’ అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా ఇతర యూజర్లు రిపోర్ట్ చేసిన మోసాల వివరాలను మనం నేరుగా చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలాంటి కొత్త తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయో దీని ద్వారా ముందుగానే తెలుసుకుని అప్రమత్తమవ్వవచ్చు. ఒకవేళ మీరు కూడా ఏదైనా మోసపూరితమైన మెసేజ్‌ను గుర్తిస్తే.. మీ సొంత మాటల్లో దాన్ని రిపోర్ట్ చేసే సౌలభ్యం కూడా ఇందులో ఉంది.

భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్స్..

Advertisement

యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు ట్రూకాలర్ ఈ వ్యవస్థను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా మెసేజ్ లేదా నంబర్ యొక్క నిజమైన వివరాలను సరిచూసుకునే వెసులుబాటును తీసుకురావడానికి కృషి చేస్తోంది. నిత్యం ఏదో ఒక రూపంలో వచ్చే సైబర్ బెదిరింపుల నుంచి సాధారణ యూజర్లు సులభంగా రక్షణ పొందేలా ఈ టూల్‌ను డిజైన్ చేశామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఎవరెవరు ఉపయోగించవచ్చు?

ప్రస్తుతం ఈ స్కామ్ చెకర్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అలాగే భారతదేశంలో ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లందరికీ ఇది ఇప్పటికే సేవలు అందిస్తోంది. త్వరలోనే ఇతర దేశాల ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు, ఐఓఎస్ (ఐఫోన్) యూజర్లకు కూడా ఈ ఆప్షన్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీకు కూడా ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే ట్రూకాలర్ స్కామ్ చెకర్‌లో తనిఖీ చేసి సురక్షితంగా ఉండండి.

Also Read: పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

Tags

Related News

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తుట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

Big Stories

Advertisement
×