E-Paper
Advertisement

చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!
Advertisement

NoiseFit Halo Limited Edition: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైం చూసుకునే గాడ్జెట్ మాత్రమే కాదు, అది మన ఫిట్‌నెస్‌ను, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక పర్సనల్ అసిస్టెంట్. యూత్ నాడిని సరిగ్గా అంచనా వేస్తూ ప్రముఖ వియరబుల్ బ్రాండ్ నాయిస్ మార్కెట్లోకి తీసుకొచ్చిన నాయిస్‌ఫిట్ హలో లిమిటెడ్ ఎడిషన్ ప్రస్తుతం టెక్కీల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రీమియం మెటాలిక్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దాని డిస్‌ప్లే. ఇందులో అత్యంత స్పష్టమైన 1.43 ఇంచుల రౌండ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల ఎండలో బయటికి వెళ్లినా స్క్రీన్‌పై ఉన్న అక్షరాలు,వాచ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. రంగులు చాలా వైబ్రెంట్‌గా ఉంటాయి. దీనికి.. తోడు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ సపోర్ట్ కూడా ఉండటంతో వాచ్ లుక్ మరింత ప్రీమియమ్‌గా మారుతుంది.

బ్లూటూత్ కాలింగ్,స్మార్ట్ కనెక్టివిటీ:

Advertisement

ఫోన్ జేబులో.. లేదా బ్యాగ్‌లో ఉన్నప్పుడు ఎవరికైనా కాల్ మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. వాచ్‌లోని స్పీకర్ , మైక్రోఫోన్ సహాయంతో.. నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా రిసీవ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ సింక్, కాల్ హిస్టరీ వంటి ఆప్షన్లు కూడా ఇందులో చాలా బాగా పని చేస్తాయి.

హెల్త్ ,ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ పార్టనర్. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే SpO2 సెన్సార్, నిద్రను విశ్లేషించే స్లీప్ మానిటర్ వంటి అనేక హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు రన్నింగ్, సైక్లింగ్, యోగా వంటి విభిన్న రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైలీ చేసే వర్కవుట్లు, బర్న్ అయిన కేలరీలను ఇది కచ్చితంగా లెక్కగడుతుంది.

ప్రీమియం మెటాలిక్ బిల్డ్, బ్యాటరీ బ్యాకప్:

Advertisement

లిమిటెడ్ ఎడిషన్ కావడంతో.. దీని డిజైన్‌పై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్టైలిష్ రౌండ్ డయల్ , ప్రీమియం మెటాలిక్ బిల్డ్ దీనికి ఒక రిచ్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. సాధారణ వాడకంలో దీని బ్యాటరీ దాదాపు 5 నుంచి 7 రోజుల వరకు ఈజీగా వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా వర్కవుట్ చేసేటప్పుడు చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.

Also Read: రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!

రూ.2,599 బడ్జెట్ :

ఇన్ని ప్రీమియం ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే, మెటాలిక్ ఫినిషింగ్ ఉన్న ఈ స్మార్ట్‌ వాచ్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుతం ఆఫర్ల ద్వారా కేవలం రూ.2,599 ధరకే ఇది కస్టమరలకు లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఒక స్టైలిష్, ఫీచర్లతో నిండిన స్మార్ట్‌ వాచ్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.

తక్కువ బడ్జెట్‌లో హ్యాండ్సమ్ లుక్, కాల్ ఫీచర్, హెల్త్ ట్రాకింగ్ కోరుకునే ప్రతి ఒక్కరూ నాయిస్‌ ఫిట్ హలో లిమిటెడ్ ఎడిషన్‌ను కొనొచ్చు. మీ ట్రెండీ లైఫ్‌స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×