E-Paper
Advertisement

రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!

రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!
Advertisement

TRIGGR Raze 2 TWS:  ప్రస్తుత డిజిటల్ జనరేషన్‌లో ఇయర్‌ బడ్స్ లేని రోజు గడవదంటే.. అతిశయోక్తి కాదు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఫీసు పని చేస్తున్నప్పుడు లేదా ఆన్‌ లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి క్వాలిటీ ఉన్న ఇయర్‌ బడ్స్ ఉండటం ఎంతో అవసరం. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే యూత్ కోసం ప్రముఖ బ్రాండ్ TRIGGR మార్కెట్లోకి ‘TRIGGR Raze 2’ ట్రూ వైర్‌ లెస్ బ్లూటూత్ హెడ్‌ సెట్‌ను తీసుకువచ్చింది. వాయిడ్ బ్లాక్ కలర్, రబ్బర్ ఫినిష్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

లేటెస్ట్ బ్లూటూత్ v6.0, స్టెబిలిటీ:

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ ఇందులో వాడిన కనెక్టివిటీ టెక్నాలజీ. సాధారణంగా మార్కెట్లో దొరికే బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో పాత బ్లూటూత్ వెర్షన్లు ఉంటాయి. కానీ ఈ మోడల్ లో మరింత లేటెస్ట్ అయిన బ్లూటూత్ v6.0 ను అందించారు. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్షన్ ఎప్పుడూ సూప ర్‌ఫాస్ట్‌గా ఉంటుంది. ఎలాంటి కాల్ డ్రాప్స్ సమస్య లేకుండా.. దూరం నుంచి కూడా మంచి కనెక్టివిటీని ఇది అందిస్తుంది.

గేమర్స్ కోసం అల్ట్రా-లో 40ms లేటెన్సీ:

Advertisement

BGMI లేదా FreeFire వంటి కాంపిటీటివ్ మొబైల్ గేమ్స్ ఆడే గేమర్స్‌కు ఆడియో సింక్ చాలా ముఖ్యం. శత్రువుల అడుగుల చప్పుడు సరిగ్గా వినపడాలంటే.. తక్కువ లేటెన్సీ అవసరం. ఈ ఇయర్‌ బడ్స్ కేవలం 40ms అల్ట్రా-లో లేటెన్సీ తో వస్తాయి. అంటే గేమింగ్ సమయంలో.. ఆడియో , వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా రియల్-టైమ్ సౌండ్ ఫీల్ ఇస్తుంది. దీనికి తోడుగా ఉండే ప్రత్యేకమైన ‘బాటిల్-LED’ లైటింగ్ దీనికి ఒక పర్ఫెక్ట్ గేమింగ్ లుక్‌ను ఇస్తుంది.

Also Read: అన్-నోన్ యాప్స్‌కు ఈ పర్మిషన్లు ఇస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం!

40 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ :

Advertisement

ఒక సారి ఛార్జ్ చేస్తే రోజంతా పని చేసే బ్యాటరీ బ్యాకప్ ఉండాలని.. కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది మొత్తం దాదాపు 40 గంటల పాటు నాన్‌ స్టాప్ బ్యాక్‌ అప్‌ను ఇస్తుంది. అంటే.. వారం రోజులు ఒకసారి ఛార్జ్ చేసినా సరి పోతుంది. ఇక దీని డిజైన్ విషయానికి వస్తే.. వాయిడ్ బ్లాక్ కలర్‌లో ప్రీమియం రబ్బర్ ఫినిష్ తో ఇది వస్తుంది. చేతిలో.. పట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్‌గా, గ్రిప్పిగా ఉండటంతో.. పాటు కింద పడినా త్వరగా డ్యామేజ్ కాదు.

రూ.999 బడ్జెట్ ధర:

ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, లేటెస్ట్ BT v6.0, గేమింగ్ లైట్స్ ఉన్నప్పటికీ దీని ధరను కేవలం రూ.999 గా నిర్ణయించారు. మార్కెట్లో ..ఈ ప్రైస్ రేంజ్‌లో ఇన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్లతో ఇయర్‌ బడ్స్ దొరకడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.సామాన్యులకు, కాలేజీ స్టూడెంట్స్ బడ్జెట్‌కు ఇది పూర్తిగా సరి పోతుంది.

తక్కువ ధరలో స్టైలిష్ లుక్,లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , గేమింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ గాడ్జెట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ.1000 లోపు బెస్ట్ TWS కొనాలనుకునేవారు వారు నిస్సందేహంగా దీన్ని ట్రై చేయొచ్చు.

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×