BigTV English

Bahubali Re Release Run Time : బాహుబలి రీ రిలీజ్‌ రన్ టైంపై రూమర్స్.. రానా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు!

Bahubali Re Release Run Time : బాహుబలి రీ రిలీజ్‌ రన్ టైంపై రూమర్స్.. రానా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు!

Bahubali Re Release Run Time :బాహుబలి (Bahubali) తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమా ఇది. అంతలా తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి.. ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై ఈ ఏడాదికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. ఈ సినిమా రెండు భాగాలను ఒకే పార్ట్ లో రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.


బాహుబలి రన్ టైమ్ పై రోజుకొక రూమర్..

ఇకపోతే ఈ సినిమా ప్రకటన వెలువడిన రోజు నుంచి దీని రన్ టైం పై రోజుకొక రూమర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిడివి 5:30 గంటలు అని ఒకరు.. లేదు 4:00 గంటల అని మరొకరు.. ఇలా రకరకాల పోస్ట్లు పెడుతున్నారు. అంతేకాదు థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టడానికి రెండు సినిమాలను ట్రిమ్ చేసి..3:30 గంటల రన్ టైమ్ తో రిలీజ్ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.


బాహుబలి రన్ టైమ్ పై రానా క్లారిటీ.

ఇలా రోజుకొక రన్ టైం తో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా నటుడు రానా (Rana ) ఈ విషయంపై స్పందించారు. బాహుబలి సినిమాలో భల్లాల దేవా పాత్రలో అద్భుతంగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..ఈ సినిమా రన్ టైమ్ పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఆయనకు మాత్రమే తెలుసు – రానా దగ్గుబాటి

రానా మాట్లాడుతూ.. “ఈ సినిమా ఎంత నిడివి ఉన్నా నాకు ఆనందమే. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించకుండానే.. నాకు ఒక బ్లాక్ బస్టర్ రాబోతోంది. నిజానికి ఈ సినిమా రన్ టైం ఎంత అనేది నాకు కూడా తెలియదు. నాలుగు గంటలు అని పోస్ట్లు పెడుతున్నారు.అంత నిడివి ఉంటే అసలు సినిమా చూస్తారా? దీని రన్ టైం ఎంత అనేది కేవలం ఒక రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. ఆయన ప్రతి విషయంపై చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సినిమా రన్ టైం ఎంత అనేది ఆయన చెప్పేవరకు ఎవరికీ తెలియదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే రానాకు కూడా ఈ సినిమా రన్ టైం ఎంత అనేది తెలియదు అంటే మరి రాజమౌళి ఎప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తారో చూడాలి.

బాహుబలి : ది ఎ పిక్ పేరిట రీ రిలీజ్..

ఇకపోతే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను కలిపి బాహుబలి l: ది ఎపిక్ పేరిట ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

రానా సినిమాలు..

ఇక రానా విషయానికి వస్తే నటుడిగా కంటే నిర్మాతగా భారీ సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చు. తాజాగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ALSO READ:Kangana Ranaut: మాధవన్ తో రొమాన్స్ కి సిద్ధమైన కంగనా.. ఈసారి అలాంటి సబ్జెక్టుతో!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×