Ranabaali Pre Release Event:విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం.
అయితే ఈ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈవెంట్ కి కాస్త లేటుగా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేయాల్సిన బ్యాట్స్మెన్ ని లాస్ట్ లో పంపించినట్టు తన పరిస్థితి ఉందంటూ కామెడీ చేశాడు.
విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడుతూ
అయితే తెలంగాణ బతుకమ్మ దసరా సందర్భంగా జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో రావడం లేట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడుతూ రణబాలి సినిమా మొదలైనప్పటి నుండి విజయ్ చాలా కష్టపడుతున్నాడని ,ఇక రాహుల్ సంకృత్యాన్ సినిమా కోసం ఎంతగా పరిశోధన చేస్తున్నాడో , ఎంత ప్యాషన్ చూపిస్తున్నాడో తనకు తెలుసు అని చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్న విజయ్ కష్టం మామూలుది కాదని,ఒక సినిమా అద్భుతంగా రావడం కోసం దాని వెనక నటీనటులు దర్శకులు ఎంత కష్టపడతారో హరీష్ శంకర్ ఎమోషన్ గా చెప్పుకొచ్చాడు.
సినిమా కోసం పెట్టె ఎఫర్ట్ ని ఎవరు ట్రోల్ చేయలేరు
ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ మరింత ఎమోషనల్ అయ్యాడు. ఈమధ్య ఒక ఈవెంట్లో విజయ్ తో ఆన్లైన్ ట్రోల్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ మాట్లాడే విధానాన్ని,ఆయన బాడ్ లాంగ్వేజ్ ని విమర్శిస్తారేమో కానీ,ఆయన పడ్డ కష్టాన్ని సినిమా కోసం పెట్టె ఎఫర్ట్ ని ఎవరు ట్రోల్ చేయలేరని స్పష్టం చేశాడు .
ఇక సినిమా ఫీల్డ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా సహజమని,ఒక సినిమా ఆడకపోతే ఇంకో సినిమా చేయడం మానమని,సినిమా బ్లాక్ బస్టర్ అయితే ప్రయత్నాలు ఆపేయమని హరిష్ శంకర్ కుండబద్దలు కొట్టాడు. సినిమా మీద ప్రేమతో జర్నీ చేసే వాళ్లని సినిమానే న్యాయం చేస్తుందని తెలిపాడు.ఇక తన గద్దల కొండ గణేష్ సినిమాలో కూడా సినిమా మనిషిని సినిమానే నిలబెడుతుందనే డైలాగ్ రాశానని గుర్తు చేసుకున్నాడు .
తనకున్న పరిచయం గురించి చెబుతూ
ఇక విజయ్ దేవరకొండతో తనకున్న పరిచయం గురించి చెబుతూ పెళ్లి చూపులు సినిమా నుంచి విజయాన్ని చాలాసార్లు కలిసే వాడినని,కలిసిన ప్రతిసారి ఎంతో అఫెక్షన్ చూపించేవాడని,అతడిలోని పాజిటివ్ ఎనర్జీ తనకి ఎంత నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక రాహుల్ సంకృత్యాన్ గురించి మాట్లాడుతూ కెరీర్ మొదట్లోనే ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథను ఎంచుకోవడం,అందులో విజయ్ దేవరకొండను ఊహించుకోవడం మామూలు విషయం కాదని ఆకాశానికి ఎత్తేశాడు . రాహుల్ కి రణబాలితో పెద్ద సక్సెస్ రావాలని కోరుకున్నాడు.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అజయ్ అతుల్ తన తొలి సినిమా షాక్ కి కూడా మ్యూజిక్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు.
మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరిశంకర్ చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . చూడాలి మరి వీటిపై యాంటి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో !
ALSO READ :‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!