E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: హైదరాబాద్‌ వచ్చిన మనోహరితో పార్థు డెత్‌ కేసు ఎవరో లేడీ ఆఫీసర్‌ ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారట కదా ఆవిడకు పార్థు కావాలసిన వాడట కదా..? ఆవిడ చాలా స్టిక్ట్‌ అల కదా మనోహరి మరి ఆవిడ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు అని చంభా అడిగితే.. ఆవిడ నుంచి కులుమనాలి నుంచే తప్పించుకుని వచ్చాను ఇక హైదరాబాద్‌లో తప్పించుకోలేనా ఆవిడ వచ్చే వరకు ఏదో ఒక ప్లాన్‌ ఆలోచిస్తాను. ఆవిడకు దొరక్కుండా ఎస్కేప్‌ అవుతాను అంటూ మనోహరి చెప్తుంది.

వైజయంతి కేసు ఎంక్వైరీ కోసం హైదరాబాద్‌ బయలుదేరుతుంది. దారిలో ఉన్నప్పుడే హాస్టల్‌ వార్డెన్‌ సరస్వతికి ఫోన్‌ చేస్తుంది. తాను పార్థు డెత్ కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న ఆఫీసర్‌ను అని పరిచయం చేసుకుంటుంది. పెళ్లికి ముందు పార్థు మీద రెండు సార్లు అటాక్‌ జరిగిందట. అది పార్థు మీద జరిగిందా..? లేకపోతే తను పెళ్లి చేసుకోబోయే మనోహరి కోసం జరిగిందా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే వాళ్లిద్దరి గురించి మొత్తం తెలియాలి.

Advertisement

పార్థు గురించి నాకు మొదటి నుంచి తెలుసు కానీ మనోహరి గురించి తెలుసుకోవాలి అంటే మీకు తెలిసి ఉంటుంది కదా..? అందుకే మీకు ఫోన్‌ చేశాను. మీరు నా ఈ ఇన్వెస్టిగేషన్‌లో సహకరించాలి.. నన్ను ఎక్కడికి రమ్మంటారు అని వైజయంతి అడిగితే.. ఏం వద్దు మేడం నేనే వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి అని వార్డెన్‌ అడుగుతుంది. అమరేంద్ర ఇంటికే నేను వెళ్తున్నాను మీరు కూడా అక్కడికే వచ్చేయండి అని వైజయంతి చెప్తుంది సరే మేడం అంటూ వార్డెన్‌ కాల్‌ కట్‌ చేస్తుంది.

అంతా పక్కనే నిల్చుని వింటున్న రాజు.. కోపంగా ఈసారి నిజం మొత్తం చెప్పండి మేడం. ఆ రాక్షసి మనోహరికి శిక్ష పడాల్సిందే మేడం.. దాని వల్ల ఇప్పటికే రెండు నిండు ప్రాణాలు పోయాయి. అది ఇలాగే ఉంటే ఇంకా ఎంత మందిని చంపేస్తుందో రండి మేడం మీరు ధైర్యంగా వెళ్దాం నేను వస్తాను.. ఇవాళ ఆ మేడంకు అమర్‌ సార్‌ మీరు నిజం చెప్పాలి అంటూ రాజు, వార్డెన్‌ను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

ఇంట్లో పార్థు రూంను క్లీన్ చేయమని మిస్సమ్మ, రాథోడ్‌కు చెప్తుంది. రాథోడ్‌ ఎందుకని అడిగితే ఢిల్లీ నుంచి వైజయంతి మేడం వస్తున్నారు. ఆవిడ నేరుగా ఇంటికే వస్తున్నారని ఆయన చెప్పారు.  అందుకే ఆవిడ ఇక్కడకు వచ్చే లోపు ఈ రూంలో పార్థుకు సంబంధించినవి ఏవీ ఉండకూడదు. ఆవిడ ఈ రూంలోనే ఉంటారు రాథోడ్‌. కాబట్టి పార్థు ఐటమ్స్‌ ఏవి కనిపించినా ఆవిడ బాధపడతారు. అందుకే పార్థుకు సంబంధించిన ఐటమ్స్‌ అన్ని తీసేసి రూం నీట్‌గా చేద్దాం అంటూ మిస్సమ్మ చీపురు తీసుకుని క్లీన్‌ చేస్తుంటే.. రాథోడ్‌ పార్థు ఐటమ్స్‌ అన్ని ఒక బాక్స్‌లోకి సర్దుతుంటాడు. చంభా వెళ్లి ఎందుకు క్లీన్‌ చేస్తున్నారు అని అడిగితే రాథోడ్‌ కోపంగా తిట్టి నువ్వు చేయాల్సిన పనులు మేము చేసుకుంటున్నాము అంటాడు.

మిస్సమ్మ చీపురుతో క్లీన్‌ చేయడం చూసి అయ్యో మేడం నేను ఊడుస్తాను ఇటివ్వండి అంటూ మిస్సమ్మ చేతిలోని చీపురు లాక్కుంటుంది. అప్పుడే ఆ రూంలోకి మనోహరి వస్తుంది. వెనకాలే అమర్‌ వస్తాడు. ఎందుకు పార్థు ఐటమ్స్‌ అన్ని బాక్సులో వేస్తున్నావు రాథోడ్‌ అని అడిగితే.. స్టోర్‌ రూంలో పెడుతున్నామని రాథోడ్ చెబితే మనోహరి ఎమోషనల్‌ అయినట్టు నటిస్తూ.. నా పార్థు జ్ఞాపకాలను తుడిచేయాలని చూస్తున్నారా..? అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అందుకు అమర్‌.. ఈ రూంలోకి వైజయంతి మేడం వస్తున్నారు మనోహరి అందుకే క్లీన్‌ చేయిస్తున్నాను అంటాడు. వైజయంతి మేడం ఇప్పుడు రావడం ఏంటి..? అని మనసులో అనుకుంటూ మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

Big Stories

Advertisement
×