Vaishnavi Sony:వైష్ణవి సోని.. బాసింగ బలాలే అంటూ అదిరిపోయే ఫోక్ సాంగ్ తో ఆకట్టుకున్న ఈ ఫోక్ డాన్సర్ ఇప్పుడు తెగ పాపులర్ అవుతుంది. ముఖ్యంగా వైరల్ అవుతున్న ప్రతి ఫోక్ సాంగ్ లో ఈ భామే కనిపించడంతో అసలు వైష్ణవి సోని అసలు ఎలాంటి ఫోక్ సాంగ్స్ చేసిందా,ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందా అంటూ ఆరాల తీస్తున్నారు ఫోక్ లవర్స్.
ఫోక్ సాంగ్స్ విషయానికి వస్తే
ఇక వైష్ణవి సోనీ చేసిన ఫోక్ సాంగ్స్ విషయానికి వస్తే ”తట్టుకోలేనే ”అంటూ చేసిన ఫోక్ సాంగ్ వైష్ణవి సోనీ కి మంచి పేరు తీసుకొచ్చింది, ఇక ఈశ్వర్ సాయితో కలిసి చేసిన ”మల్లె చెట్టు కింద కూర్చున్న” అనే పాట కూడా ఆడియన్స్ లో మంచి గుర్తింపుని తీసుకొచ్చింది ,ముఖ్యంగా ఈ పాటలో వైష్ణవి సోనీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆడియోస్ కట్టిపడేస్తాయి,
ఇక ”గున్న గున్న ఓయ్” అనే ఫోక్ సాంగ్ వైష్ణవి సోనిని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసిందని చెప్పాలి .ఈ పాట వైష్ణవి సోనీ కెరీర్ లో ఒక మంచి ఫోక్ సాంగ్ గా మిగిలిపోయింది .ఇక ”బాగుంది”,”బిందె మీద బిందె పెట్టి ”అనే పాటలు వైష్ణవి సోనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే .
‘201 మిలియన్ల వ్యూస్’ కొల్లగొట్టడంతో
అన్నిటికన్నా మించి ఈశ్వర్ సాయితో కలిసి చేసిన ”బాసింగా బలాలు” అనే పాట ఒక్కసారిగా వైష్ణవి సోనీ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఈశ్వర్ సాయితో కలిసి వేసిన స్టెప్పులు, అలాగే తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు .ఇక ఈ సాంగ్ ఇప్పటికీ ‘201 మిలియన్ల వ్యూస్’ కొల్లగొట్టడంతో ఇపుడు వరుసగా మరిన్ని ఫోక్ సాంగ్స్ వైష్ణవి సోనీ ముందు క్యూ కడుతున్నాయి.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
అయితే వైష్ణవి సోనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె స్కూలింగ్ డేస్ లో నుంచి ఫోక్ సాంగ్స్ పై ఎంతో ఇష్టం చూపెట్టెదని తెలుస్తుంది. అలా క్రమంగా తన తల్లి సహాయంతో ఫోక్ సాంగ్స్ లో తనదైన గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేసింది. ఇక వైష్ణవి సోనీ ఒక పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుంది టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కస్ అవుతుంది.
తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్
అయితే వైష్ణవి సోని ఒక్కో పాటకి దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో తీసుకుంటుంది అన్న టాక్ వినిపిస్తుంది .మరి ఇందులో ఎంత నిజం ఉందో తనే బయట పెట్టాలి. మొత్తానికి బాసింగా బలాలు అనే పాటతో ఒకసారి లైమ్ లోకి వచ్చిన వైష్ణవి సోనీ ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు!
ALSO READ :మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?