E-Paper
Advertisement

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Romanchakam OTT: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి(Pranay Reddy Vanga) నిర్మాణంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా “రోమాంచకం”(Romanchakam). సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas), అనంతిక (Ananthika) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా మిశ్రమ స్పందన రావడంతో ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారంటూ ప్రొడ్యూసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెట్ ఫ్లిక్స్ లో రోమాంచకం…

ఈ సినిమా కోసం సందీప్ రెడ్డితో పాటు ప్రభాస్ లాంటి స్టార్స్ అందరూ కూడా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా థియేటర్ రన్ ముగియడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net flix) కైవసం చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు.

అక్టోబర్ 1 నుంచి రోమాంచకం ప్రసారం..

Advertisement

రోమాంచకం పోస్టర్ విడుదల చేస్తూ..స్టార్టప్ అన్వేష్‌కు క్యూపిడ్ అవసరం లేదు, ఎందుకంటే అతనికి సొంత డేటింగ్ యాప్ ఉందంటూ ఈ సినిమా అక్టోబర్ 1 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో కూడా విడుదల కాబోతోందని తెలిపారు. మరి థియేటర్లలో మిశ్రమ స్పందన లభించుకున్న ఈ సినిమాకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీ చదువు పూర్తి చేసిన అన్వేష్(సుమంత్ ప్రభాస్) స్నేహితులతో కలిసి స్టార్ట్ ప్రారంభించాలనుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక డేటింగ్ యాప్ తయారు చేసే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలోనే మైథిలి (అనంతిక) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇలా మైధిలి ప్రేమలో ఉన్న అన్వేష్ తనని కలవడానికి చెన్నై వెళ్తారు అయితే అక్కడ అన్వేష్ కు అనుకోని షాక్ ఎదురవుతుంది. అదే సమయంలో మైధిలి అన్వేషణను బ్లాక్ చేయడంతో పాటు కనిపించకుండా వెళుతుంది. మైథిలి ఎందుకు అన్వేష్ విషయంలో అలా చేసింది? ఆమెకు ఏం జరిగింది? మైథిలి కనిపించకుండా పోవడం వెనుక గల కారణం ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా కొనసాగుతుంది.

Also Read: పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆతృత ఎందుకో అంటూ?

Related News

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి..హోస్ట్ గా కొత్త బాధ్యతలు?

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

Big Stories

Advertisement
×