Jio Recharge: జియో ప్రిపెయిడ్ ప్లాన్ మార్చాలనుకుంటున్నారా? ఒకదానికి బదులు పొరపాటున ఇంకో ప్లాన్ కు రీఛార్జ్ చేశారా? అయితే ఈ వార్త మీకోసమే. రీఛార్జ్ సమయంలో జరిగే పొరపాటును సరిదిద్దుకునేందుకు యూజర్లకు జియో అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకు వేచి చూడాల్సిన పనిలేకుండానే.. కొత్త ప్లాన్‌ను వెనువెంటనే యాక్టివేట్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం జియో యూజర్లు ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా ప్రతీ ఒక్కరి డేటా, కాలింగ్ అవసరాలు ఒకేలా ఉండవు. రోజూ ఎక్కువ డేటా వాడేవారు అధిక డేటా ప్లాన్లను.. తరచూ రీఛార్జ్ తప్పించుకోవాలనుకునేవారు సుదీర్ఘ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లను ఎంచుకుంటారు. కాబట్టి అందుబాటులో ఉన్న రకరకాల జియో ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు, ఆఫర్లను మైజియో (MyJio) యాప్, జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా ఎంచుకోవచ్చు.
మై జియో యాప్ లో కొత్త ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడం చాలా ఈజీ. మొదట మీ ఫోన్ లో మైజియో యాప్ ఓపెన్ చేసి జియో నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రీఛార్జ్ (Recharge) సెక్షన్‌కు వెళ్లి రకరకాల ప్లాన్లలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆ ప్లాన్ డేటా పరిమితి, వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాలను ఒకసారి చెక్ చేసుకుని చెల్లింపు పూర్తి చేయాలి. రీఛార్జ్ పూర్తయిన తర్వాత, ఆ కొత్త ప్లాన్ వెంటనే అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ‘అప్‌కమింగ్ ప్లాన్’ (Upcoming Plan)గా క్యూలో ఉండిపోతుంది.
Also Read: నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?
రీఛార్జ్ చేసిన ప్లాన్ క్యూలోకి వెళ్తే పాత ప్లాన్ గడువు ముగిసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. దానిని వెంటనే యాక్టివ్ చేయడానికి మైజియో యాప్‌లో ‘మొబైల్’ (Mobile) ఆప్షన్‌పై క్లిక్ చేసి, మెనూ ద్వారా ‘మై ప్లాన్స్’ (My Plans) సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ ఉన్న ‘అప్‌కమింగ్’ (Upcoming) ట్యాబ్‌ను ఎంచుకుంటే మీరు కొత్తగా చేసిన రీఛార్జ్ వివరాలు కనిపిస్తాయి. దానికి ఎదురుగా ఉన్న ‘యాక్టివేట్’ (Activate) బటన్ నొక్కి, కన్ఫర్మ్ చేస్తే చాలు.. కొత్త ప్లాన్ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
Also Read: ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!