E-Paper
Advertisement

రణబాలికి రూ. 120 కోట్లు.. అప్పుడే వచ్చిందెంతంటే?

రణబాలికి రూ. 120 కోట్లు.. అప్పుడే వచ్చిందెంతంటే?
Advertisement

Ranabali Movie:దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి, ప్రేక్షకుడికి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎన్నో సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ దసరా సెలవులలో ప్రత్యేకంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తూ.. సీమ ప్రేక్షకులను ఎంతగానో వెయిట్ చేయిస్తున్న చిత్రం రణబాలి. ఈ దసరాకి అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా వివాహం అనంతరం విజయ్ దేవరకొండ (Vijay deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

దీనికి తోడు టాక్సీవాలా సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడం కూడా సినిమాపై అంచనాలు పెంచడానికి మరో కారణం అని చెప్పాలి. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. సుమారుగా 120 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్టు సమాచారం.

రణబాలి మూవీకి రూ.120 కోట్ల బడ్జెట్.. నటీనటుల రెమ్యూనరేషన్?

Advertisement

భూషణ్ కుమార్, గుల్షన్ కుమార్ టి – సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి అనురాగ్ పర్వతనేని, శివ రచన సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చెంబోలు సాయి ఆదిత్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి సుమారుగా రూ. 120 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అందులో హీరో హీరోయిన్ అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట సుమారుగా రూ. 30 కోట్లు తీసుకున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అలాగే ఇతర నటీనటుల పారితోషకాలకు సుమారుగా రూ.30 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇక మిగిలిన రూ.60 కోట్లు సినిమా కోసం ఖర్చు పెట్టారట.

అప్పుడే వచ్చింది ఎంతంటే?

అయితే ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.60 కోట్ల వరకు వెనక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైనప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయిందట. దీంతో నిర్మాతలకు ఈ బెంగ లేదనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాని ముందుగా అనుకున్నట్లు రూ.80 కోట్ల లోపు పూర్తి చేసి ఉంటే.. నిర్మాతలు విడుదలకు ముందే గట్టెక్కే వాళ్ళు. కానీ అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఈ సినిమాకి ఖర్చు పెరుగుతూ వెళ్ళింది. చివరికి 120 కోట్లకు చేరుకుంది. దీంతో సగం నాన్ థియేట్రికల్ నుంచి వచ్చింది. కాబట్టి మిగిలిన సగం బాక్సాఫీస్ వద్ద రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దసరా సీజన్ కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే అది పెద్ద కష్టమేమి కాదని మైత్రి మూవీస్ కూడా గట్టిగా నమ్ముతోంది.

Advertisement

also read:రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

రణబాలిపై మైత్రి మూవీ మేకర్స్ భవిష్యత్తు..

ఇదివరకే మైత్రి మూవీ నుంచి వచ్చిన ఇరుముడి సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లో పడిన మైత్రి మేకర్స్ రణబాలి సినిమాతో మళ్లీ నిలదొక్కుకోగలిగితే.. ఇక మైత్రి మూవీ మేకర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రణబాలి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అభిమానులు ఇటు చిత్ర బృందం గట్టిగా ఆకాంక్షిస్తున్నారు.

Related News

మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

Big Stories

Advertisement
×