Bigg Boss 10:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్.. వినూత్నమైన టాస్క్ లతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. లవ్ బర్డ్స్, కంటెస్టెంట్స్ మధ్య వార్, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఇలా ఒక్కటేమిటి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి లభిస్తోంది. ఇకపోతే మిగతా తొమ్మిది సీజన్లతో పోల్చుకుంటే.. ఈ పదవ సీజన్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేసింది.తాజాగా వీకెండ్స్ లో భాగంగా శనివారం ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. మొదటి ప్రోమోలో శాలిని, రోహిత్ లకు షాక్ ఇచ్చిన నాగార్జున ..ఇప్పుడు రాంప్రసాద్ బిహేవియర్ ను మార్చుకోమంటూ ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి . పైగా అపూర్వ గుట్టు శాలిని బయటపెట్టింది.
రాంప్రసాద్ ని పిలుస్తూ.. పవిత్రమైన పెళ్లి సంగతి గురించి మాట్లాడుకుందామా? అంటూ నాగార్జున అడిగారు. రాంప్రసాద్ మాట్లాడుతూ..” బిగ్ బాస్ చెప్పారు.. నాకు ఒక మంచి అబ్బాయిని చూసుకోమని.. నాకు అనిపిస్తోంది.. నాకు మంచి అబ్బాయిని చూడు రామన్న అని చెప్పింది.. రాంప్రసాద్ చెబుతుండగానే.. సరదాగా అని ఉండొచ్చు కదా అని నాగార్జున ప్రశ్నించారు. సరదాగా అంటే ఓకే సార్.. కానీ గొడవ వచ్చినప్పుడు సీరియస్ గా.. నేను అడిగింది పవిత్రమైన పెళ్లి కోసం అంటూ అపూర్వ చెప్పిందని రాంప్రసాద్ చెప్పారు.
also read:‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !
దీనికి అపూర్వ మాట్లాడుతూ.. ” అబ్బాయిని సెట్ చేయండి.. లవ్ కంటెంట్ చేసుకుంటాను .. నాకు ఆ ఇంటెన్షన్ ఎవరిమీద లేదు” అని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇంతలోనే శాలిని మాట్లాడుతూ.. వచ్చిన వెంటనే రోహిత్ కి ఏం చెప్పిందంటే
. నీది నాది బయట మంచి హిట్ పెయిర్.. మనిద్దరిది బాగుంటుంది కదా” అంటూ ఒక మాట రోహిత్ తో చెప్పింది. రోహిత్ – శాలిని పెయిర్ కూడా బాగాలేదని రోహిత్ తో చెప్పింది . సో తాను ఏదైతే లవ్ కంటెంట్ కోసం రాలేదు అని చెప్పిందో.. అదంతా ఫేక్ అంటూ అపూర్వ గుట్టు బయట పెట్టింది శాలిని. ఇక మొత్తానికైతే అపూర్వ ఇప్పుడు నాగార్జున ముందు చేసిన కామెంట్లు.. వెనుక రోహిత్తో చెప్పిన మాటలను బట్టి చూస్తే నిజంగా అపూర్వ ఎందుకు డబల్ గేమ్ ఆడుతోంది. అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే శాలిని చేసిన కామెంట్లకి నాగార్జున ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయినట్లు ఈ ప్రోమోను కట్ చేశారు. తదుపరి ప్రోమోలో ఆయన ఏదైనా మాట్లాడతారా? లేక అసలు విషయం కోసం రాత్రి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాలా అనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఈ వారం కంటెస్టెంట్స్ అందరికీ కూడా హోస్ట్ నాగార్జున గట్టిగానే ఇస్తున్నట్లు ప్రోమోల ద్వారా వైరల్ చేస్తున్నారు .ఇదిలా ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. మరొకవైపు చరణ్ , అపూర్వల పేర్లు గట్టిగా వినిపిస్తుంటే.. మరొకవైపు రోహిత్ నాయుడు ఎలిమినేట్ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.