E-Paper
Advertisement

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!
Advertisement

Rao Bahadur OTT :ఓటీటీ ఏ ముహూర్తాన ఎంట్రీ ఇచ్చేసిందో కాని వరల్డ్ సినిమాని అరచేతిలోకి తెచ్చేసింది.అంతే కాకుండా థియేటర్ లోకి మీరు రారా అయితే మీ దగ్గరికే సినిమా తెచ్చేస్తాం అంటూ రిలీజ్ అయిన నెలలోపే ఎన్నో సినిమాలని ఆడియన్స్ దగ్గరికి తెచ్చేసింది.ఇదే క్రమంలో జులై 3న రిలీజ్ రిలీజ్ అయిన పీరియడ్ సోషల్ డ్రామా ‘రావు బహదూర్’ కూడా ఇపుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయుపోయింది.

అవును ..జులై 31న నెట్ ఫ్లిక్స్ లోకి ఇచ్చేస్తుంది.ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి వరల్డ్ వైడ్ గా రిలీజ్ స్ట్రీమింగ్ అవుతుండటం తో సినిమాపై మరోసారి హైప్ మొదలైంది.ఒకరకంగా థియేటర్ లో చూడని వారికి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

ఓటీటీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో

నిజానికి సినిమాకి థియేటర్లలో మంచి టాక్ వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద రిఫ్లెక్ట్ కాలేకపోయింది. అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు అంటూ గట్టిగానే ప్రమోషన్ చేశారు. సందీప్ వంగా, రాహుల్ రవీంద్రన్ వంటి వారు వీడియోలు,పోస్ట్స్ వదిలి ప్రమోట్ చేశారు కూడా. ముఖ్యంగా సత్యదేవ్ బాగా యాక్టింగ్ చేశాడని,సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయని, కథలో కంటెంట్ సాలిడ్ గా ఉందంటూ చూసిన ఆడియన్స్ ఆకాశానికి ఎత్తేశారు కూడా.మరి ఈ  అదే పాజిటివ్ టాక్ ఓటీటీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

Advertisement

అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా

దర్శకుడు వెంకటేష్ మహా  ఈ సినిమాను పీరియడ్ ఫీల్ ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించాడనే చెప్పాలి.కథాపరంగా  సెట్స్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత గ్రాండియర్ లుక్ తీసుకువచ్చాయి.ఇక సినిమాలో వచ్చే  ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసేలా ఉంటాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా కథనే నమ్ముకుని సినిమా తీశారని చూస్తుంటేనే అర్థం అవుతుంది.

also read :బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

సత్యదేవ్ విషయానికి వస్తే రొటీన్ కథలు కాకుండా  వెరైటీ కథల్ని సెలెక్ట్ చేసుకోవడంలో తన మార్క్ చూపిస్తుంటాడు. హీరో ఇమేజ్ కోసం కాకుండా కథ కోసం సినిమాలు చేసే నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది కూడా. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కృష్ణమ్మ’, ‘జీబ్రా’ లాంటి సినిమాల తర్వాత మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాలో ఆయన నటన చాలా సహజంగా ఉందని అప్పట్లో రిలీజ్ అయినప్పుడు మంచి ప్రశంసలే దక్కాయి.

ఇక ఈ సినిమాని  సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పించడం తో  అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రావడంతో మరోసారి ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది.

డిజిటల్ లో ఎలాంటి సందడి చేస్తారో

జులై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్టులు పెరుగుతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు “ఓటీటీలో మాత్రం తప్పకుండా చూస్తాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.చూడాలి మరి బాక్సాఫీస్ లో కాసులు రాబట్టలేకపోయిన రావు బహదూర్ వారు డిజిటల్ లో ఎలాంటి సందడి చేస్తారో !

Related News

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

Big Stories

Advertisement
×