Rashmika Injury: రష్మిక మందన్న రెండు రోజుల కిందట గాయపడ్డ సంగతి తెల్సిందే.దీంతో అసలు రష్మికకి ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు అభిమానులు.అయితే వాటన్నింటికి ఎండ్ కార్డ్ వేస్తూ సోషల్ మీడియా వేదికగా అసలు విషయం చెప్పేసింది ఈ నేషనల్ క్రష్.
విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమాల్లో ‘మైసా’ ఒకటి. ఈ సినిమాలోని ఓ హై ఎనర్జీ డాన్స్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా ఆమెకి ప్రమాదం జరిగింది. డాన్స్ మూవ్ మెంట్ చేస్తుండగా కుడి తుంటి భాగంలో ఉన్న టెండన్ దెబ్బతింది. వైద్యుల పరీక్షల తర్వాత అది టెండన్ టియర్ అని తేలింది. దీంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి ఆమెకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.
అయితే ఇది రష్మికకు గత కొద్ది నెలల్లో జరిగిన మూడో గాయం కావడం ఇక్కడ గమనార్హం. వరుసగా శరీరానికి ఒత్తిడి పెరిగేలా షూటింగ్స్, యాక్షన్ సీన్లు, డాన్స్ నంబర్లు చేస్తుండటంతో శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వలేకపోయానని ఆమె స్వయంగా అంగీకరించింది కూడా. “నా శరీరాన్ని మనిషి శరీరంలా కాకుండా మెషీన్‌లా ట్రీట్ చేస్తున్నానేమో… ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే గాయం గురించి చెప్పిన విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. “ఇది నాకు దేవుడు ఇచ్చిన ఫోర్స్డ్ హాలిడే అనుకుంటున్నాను. కాస్త ఆగి, నా కోసం నేను సమయం తీసుకోవాలని దేవుడే చెప్పినట్టుంది” అంటూ రష్మిక తనదైన పాజిటివ్ స్టైల్‌లో స్పందించింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ సమయాన్ని వృథా చేయకుండా పజిల్స్ సాల్వ్ చేస్తూ, పుస్తకాలు చదువుతూ గడుపుతున్నానని కూడా తెలిపింది.
అయితే ఒక విషయంపై మాత్రం ఆమె సరదాగా టెన్షన్ పడుతోంది. సాధారణంగా ప్రతిరోజూ వర్కౌట్స్ చేసే రష్మిక.. ఇప్పుడు డాక్టర్ల సూచనతో జిమ్‌కు పూర్తిగా దూరమైంది. దీంతో “ఇలా ఇంట్లో ఉంటే డెజర్ట్స్ ఎక్కువగా తినేస్తాను. తర్వాత బరువు పెరిగితే మాత్రం నన్ను ఎవరూ కాపాడలేరు” అంటూ సరదాగా కామెంట్ చేసింది.
ఇక రష్మిక పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో #GetWellSoonRashmika హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు కూడా ఆమెకు ధైర్యం చెబుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. వరుస గాయాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు సాగుతున్న రష్మికను చూసి చాలామంది ఆమె మానసిక ధైర్యాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంతా !
ఇక ప్రస్తుతం మైసాతో పటు రణ బాలి వంటి పలు భారీ ప్రాజెక్టుల రష్మిక చేతిలో ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఆమె షెడ్యూల్ ఇప్పటికే బిజీగా ఉందని చెప్పక్కర్లేదు.ఇక ఈ గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే సెట్స్‌పైకి రావాలని ఆమె టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఆరోగ్యం ముందు, సినిమా తర్వాత అనే ఆలోచనతో ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నారట.
“ఎవరూ కంగారు పడొద్దు. నేను బాగానే ఉన్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను. నా హెల్త్ గురించి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటాను” అంటూ అభిమానులకు కూల్ చేసింది మన నేషనల్ క్రష్.
also read :నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !
ఏదీ ఏమైనా ప్రతీ నటుడికి నటికీ గాయ పడటం సహజమే.కాని ఇలా రుసగా మూడుసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు.మొత్తానికి నేను సేఫ్ గా ఉన్నాను అని రష్మిక పోస్ట్ వదలడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఐయాం కమ్ బ్యాక్ అంటూ పోస్ట్ ఎప్పుడు పెడుతుందో !