Irumudi Movie : మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ఉపాధ్యాయ సమాజాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. అసలేందుకు ఈ వివాదాలు అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
*. టీచర్ పాత్రను నెగెటివ్‌గా చిత్రీకరించడం: సినిమాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలి (స్వాసిక విజయ్ పోషించిన పాత్ర) వ్యవహార శైలిని, ఆమె నేపథ్యాన్ని అత్యంత ప్రతికూలంగా, సమాజంలో ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేక భావన కలిగించేలా మలిచారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.
*. నిజమైన పాఠశాల పేరు & గుర్తింపు: సినిమాలో కేవలం కల్పిత కథగా మాత్రమే కాకుండా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ‘సీలేరు జిల్లా పరిషత్ హైస్కూల్’ పేరును నేరుగా చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
*. అధికారిక యూనిఫాం వినియోగం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరించే అధికారిక యూనిఫామ్‌నే చిత్రంలో విద్యార్థులకు వేయడం వల్ల ఇది నేరుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తప్పుడు ముద్ర వేసేలా ఉందని సంఘ నేతలు ఆరోపించారు.
*. సామాజిక బాధ్యత లోపించడం: సినిమా అనేది సమాజంపై బలమైన ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని, సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యే ఉపాధ్యాయులు, విద్యార్థుల సున్నితమైన అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు & తదుపరి చర్యలు..
*. విద్యా వ్యవస్థ గౌరవాన్ని, ఉపాధ్యాయుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను, డైలాగులను సినిమా నుంచి వెంటనే తొలగించాలి.
*. ఈ అంశంపై చిత్ర బృందం, సెన్సార్ బోర్డు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరికలు జారీ చేశారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ సినిమా కలెక్షన్లు వర్షం కురిపించడంతో సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఇలా వివాదాలు చుట్టిముట్టడంతో రవితేజ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.. ఇన్నేళ్ల తర్వాత తమ హీరో ఖాతాలో హిట్టు పడింది అని అనుకునే లోపల ఇలాంటి వార్తలు వినడం బాధగా ఉంది అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకి మంచి బస్సు ఉన్నప్పుడు ఎటువంటి విమర్శలు రాలేదు కానీ ఇప్పుడు ఇలాంటివి రావడం పై కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై ప్రశంసలు.. అయ్యో ఇంత మోసమా.. దారుణంగా మోసపోయిన అవని..