E-Paper
Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!

చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!
Advertisement

Ravi Teja:సాధారణంగా సెలబ్రిటీలు స్టేజ్ పై మాట్లాడేటప్పుడు అనుకోకుండా వచ్చే మాటలు వారిని ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ముఖ్యంగా సరదాగా మాట్లాడే మాటలు కూడా సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాస్ మహారాజా రవితేజ (Raviteja ) ఇరుముడి సినిమాలో తన కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసాయి. సభా మర్యాద ఉండక్కర్లేదా? 50 ఏళ్లు దాటినా ఆ మాత్రం తెలియదా? అంటూ రవితేజ పై మండిపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చిన్నారిపై రవితేజ అనుచిత వ్యాఖ్యలు..

మాస్ మహారాజా రవితేజ హీరోగా ,ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ(Siva nirvana) కలయికలో తెరకెక్కుతున్న విభిన్నమైన చిత్రం ఇరుముడి. ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించగా.. జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇందులో బేబీ నక్షత్ర (Nakshatra) రవితేజ కూతురు పాత్ర పోషిస్తుండగా.. సాయికుమార్(Sai kumar) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల ఆగస్టు 21న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్..

Advertisement

ఈ వేడుకలో పాల్గొన్న రవితేజ చిన్నారి నక్షత్రను ఉద్దేశించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదానికి దారి తీస్తున్నాయి. బేబీ నక్షత్ర రవితేజను ఒక ముద్దు పేరు పెట్టమని కోరింది. దానికి రవితేజ కాసేపు ఆలోచించి “ముదురు ముం*డ”అనడంతో అక్కడున్న వారంతా నవ్వారు. అయితే ఆ మాటకు అర్థం తెలియక ఆ చిన్నారి అమాయకంగా ప్రశ్నించగా.. దానికి అర్థం తర్వాత చెబుతానని రవితేజ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, రవితేజను తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ALSO READ:ఎఫ్డిఏ నోటీసులు..షారుఖ్ ఖాన్ తనను తాను సమర్ధించుకుంటున్నాడా?

రవితేజ స్పందిస్తారా?

Advertisement

బహిరంగ వేదికపై ఒక చిన్నారితో మాట్లాడేటప్పుడు కనీస బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సరదా మాటలకు, హద్దులు దాటే అనుచిత పదాలకు తేడా గుర్తించుకోవాలని, 50 సంవత్సరాల వయసు దాటింది కదా ఇలాంటి సమయంలో మనవరాలు వయసు ఉన్న అమ్మాయితో ఆ మాటలు ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో ఆ పదాన్ని కేవలం సరదాగా మాత్రమే వాడతారని, కొంతమంది నెటిజన్స్ రవితేజకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఒక చిన్నారిని ఉద్దేశించి రవితేజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై రవితేజ స్పందిస్తారేమో చూడాలి.

రవితేజ సినిమాలు..

చివరిగా మాస్ జాతర , భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మాస్ మహారాజా రవితేజ సరైన సక్సెస్ లేక ఇప్పుడు జానర్ మార్చి ఇరుముడి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

Related News

ఎఫ్డిఏ నోటీసులు..షారుఖ్ ఖాన్ తనను తాను సమర్ధించుకుంటున్నాడా?

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?

నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి తొలి అడుగు.. 36ఏళ్ల వయసులోనే ప్రముఖ నటి మృతి!

సినీ అభిమానులకు షాక్.. 27 ఏళ్లకే నటి అనన్యా కన్నుమూత!

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

Big Stories

Advertisement
×