BJP National Team: భారతీయ జనతా పార్టీ తన జాతీయ నూతన కార్యవర్గ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఏపీకి చెందిన పురంధేశ్వరిని ఎంపిక చేశారు. ఆమెతో పాటు మరో ఏపీ నేత రామ్ మాధవ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా మెుత్తం 13 మందిని బీజేపీ వైస్ ప్రెసిడెంట్స్ గా సెలక్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో రానున్న కీలక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నూతన కార్యవర్గాన్ని ఖరారు చేశారు.
ఈ నూతన నియామకాల్లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మళ్లీ ప్రాధాన్యం దక్కింది. పార్టీలోని ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా ఆమె నియమితులయ్యారు. పైన పేర్కొన్న 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు మెుత్తం 16 మందికి జాతీయ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin द्वारा निम्नलिखित सदस्यों को भाजपा के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया जा रहा है। (1/2) pic.twitter.com/tcTJsJG0dc
— BJP (@BJP4India) August 17, 2026
పార్టీకి చెందిన వివిధ విభాగాలకు (మోర్చాలు) నూతన అధ్యక్షులను కూడా బీజేపీ అధినాయకత్వం నియమించింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా హేమాంగ్ జోషి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పుల ద్వారా యువత, అనుభవజ్ఞుల మధ్య సమతుల్యతను సాధించేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.
నూతన కమిటీలో సామాజిక న్యాయానికి సైతం ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 40 శాతం పదవులను బలహీన, వెనుకబడిన వర్గాల నాయకులకు కేటాయించారు. అలాగే దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కింద నాగాలాండ్ రాజ్యసభ ఎంపీ ఫాంగ్నాన్ కోన్యాక్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేవ్‌లను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఇక దక్షిణాదిలోని ఏపీ నుంచి డి. పురంధరేశ్వరి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తమిళనాడుకు చెందిన ఎం. వెంకటేశన్ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
బీజేపీ తన నూతన జాతీయ కార్యవర్గంలో విద్యావేత్తలు, వైద్యులకు కూడా సముచిత స్థానం కల్పించింది. జేఎన్‌యూ (JNU) మాజీ ఏబీవిపీ నాయకుడు, ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ స్వదేశ్ సింగ్‌ను ఈ కొత్త టీమ్‌లో జాతీయ కార్యదర్శిగా నియమించారు. అలాగే క్యాన్సర్ నిపుణులు డాక్టర్ మధుచంద్ర కర్, కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ M. నాగరాజ్ ఇద్దరినీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. ఈ కొత్త కమిటీలో 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఆరుగురు ఉండగా.. 40-49 ఏళ్ల లోపు వారు 15 మంది, 50 – 59 మధ్య వారు 21 మంది ఉన్నారు.
Also Read: Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!
ఇదిలా ఉంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలకు బీజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అభినందనలు తెలిపారు. ‘బీజేపీ జాతీయ టీమ్‌లో కొత్తగా చేరిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు. అనుభవం, యువ శక్తి కలగలిసిన ఈ టీమ్.. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్కరూ అంకితభావం కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా’ అని నితిన్ నబీన్ ఎక్స్ లో (ట్విట్టర్) రాసుకొచ్చారు.
Also Read: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీ డబ్బులు గోవిందా!