Anshu Reddy: ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్(Youtube Channel) ప్రారంభించి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ భారీగా సంపాదించుకుంటున్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి సీరియల్స్ కి సంబంధించిన విషయాలతో పాటు ఇతర ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ భారీగా ఆదాయం అందుకుంటున్నారు.. ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో అన్షు రెడ్డి(Anshu Reddy) ఒకరు.. ఈమె ఎన్నో జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illaalu Pillalu)అనే సీరియల్ లో నర్మద పాత్రలో నటిస్తున్నారు.
నర్మద పాత్రలో అన్షు రెడ్డి…
ఇక ఈ సీరియల్ అన్షు రెడ్డి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండటమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. అన్షు రెడ్డికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ లొకేషన్లో వారందరూ ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన అన్షు రెడ్డికి తన యూట్యూబ్ సంపాదన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
నెలకు లక్షల్లో ఆదాయం…
యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించడమే కాకుండా ఎన్నో వీడియోలను చేస్తూ భారీగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఆదాయం ఎంతనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.. అయితే ఒకప్పుడు వరుస వీడియోలు చేయటం వల్ల నెలకు 4 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, ఇటీవల కాలంలో కంటెంట్ కాస్త తగ్గించడం వల్ల అనుకున్నంత రాలేదు అంటూ అసలు విషయం వెల్లడించారు. సీరియల్స్, ప్రమోషన్స్కాకుండా యూట్యూబ్ ద్వారానే నెలకు 4 లక్షల ఆదాయం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.. ఇలా యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న నేపథ్యంలోనే సెలబ్రిటీల ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.
నిశ్చితార్థం జరుపుకున్న నటి…
ఇక అన్షు రెడ్డి భార్యామణి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు నటిగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనంతరం ఇద్దరమ్మాయిలు, అష్టా చమ్మా, నా పేరు మీనాక్షి, సూర్యవంశం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు, ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న అన్షు రెడ్డి ఇప్పటికే సింగిల్గానే ఉన్నారు. గతంలో ఒక వ్యక్తితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈమె అనుకొని కారణాల వల్ల అతనితో తన నిశ్చితార్థం బ్రేకప్ జరిగింది దీంతో ఇప్పటివరకు ఈమె తిరిగి పెళ్లి చేసుకోకుండా కేవలం కెరియర్ పైనే ఫోకస్ పెట్టారు.
Also Read: Jagapati Babu: డైరెక్టర్ చేసిన పనికి ప్రాణాలు పోయాయి.. జగపతిబాబు కామెంట్స్ వైరల్!