BigTV English
Advertisement

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Kalki 2 Movie : ఒక మూస ధోరణిలో వెళుతున్న తెలుగు సినిమాను ఎస్ఎస్ రాజమౌళి వచ్చి పరుగులు పెట్టించాడు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమైన మార్కెట్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించిన తర్వాత చాలామంది అదే స్థాయిలో సినిమా చేయడానికి ఫిలిం మేకర్స్ ముందుకు వచ్చారు. అలానే నిర్మాతలు కూడా ఖర్చు పెట్టడానికి వెనక్కు తగ్గడం లేదు.


ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికీ రెండు వెయ్యికోట్ల సినిమాలు ఉన్నాయి. ఒకటి బాహుబలి రెండు కల్కి. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా ఒక సంచలనం క్రియేట్ చేసింది. కల్కి 2 సీక్వెల్ పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఈ చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమా నుండి దీపికా పదుకొనేను తప్పించారు.

దీపికాను తప్పించడానికి కారణాలు 

ఈ సినిమా కోసం దీపిక దాదాపు 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం దాదాపు 25 కోట్ల నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా కాల్ షీట్ లో కేవలం 7:00 మాత్రమే పని చేస్తాను అని దీపికా పదుకొనే చెప్పినట్లు తెలుస్తుంది.


మామూలుగా ఒక కాల్ షీట్ అంటే ఎయిట్ అవర్స్ ఉంటుంది. ఆ కాల్ షీట్ తర్వాత కూడా ఒక 30 40 నిమిషాల వరకు కొంతమంది దర్శకులు షూట్ చేసుకుంటూ ఉంటారు. అతిపెద్ద తప్పిదం కూడా కాదు. పెద్ద పెద్ద నటులు కూడా దానిని వదిలేస్తారు. మరి ఏడు గంటలు అంటే అది కుదరని పని. ప్రొడ్యూసర్ కి తీవ్రంగా నష్టం కూడా వస్తుంది.

అంతేకాకుండా అదనంగా ప్రొడ్యూసర్స్ దీపికా పదుకోన అకామ్డేన్స్ విషయంలో కూడా భయపడుతున్నారు. ఫుడ్డు ట్రావెల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ చూసుకుంటే లెక్క ఇంకో స్థాయికి వెళ్ళిపోతుంది. కేవలం దీపికా మాత్రమే కాదు దాదాపు 25 మంది ఆవిడ స్టాఫ్ ని కూడా మైంటైన్ చేయాలి అంటే సినిమా బడ్జెట్ ఆకాశాన్ని తాకుతుంది వీటన్నిటి దృష్ట్యా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సినిమా నుంచి దీపికాన్ని తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

గతంలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి కూడా దీపికా పదుకొనే ను తప్పిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఇక ప్రస్తుతం చాలామంది సందీప్ రెడ్డి వంగ కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో కూడా దర్శకుడు సందీప్ కి బీభత్సమైన ఎలివేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.

Also Read: Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ్

Related News

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?

Bandla Ganesh: బండ్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..కథల వేటలో బిజీగా!

Jigris Movie : ‘జిగ్రీస్’కు అండగా తరుణ్ భాస్కర్… క్రేజీ డైరెక్టర్ చేతుల మీదుగా ‘మీరేలే’ సాంగ్ రిలీజ్

The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన రాజా సాబ్ టీమ్.. నిరీక్షణ తప్పదా?

AA22 ×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. కన్ఫామ్ చేసిన బన్నీ!

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Big Stories

×