Priyadarshi KCR:న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా సూపర్ హిట్ అవడంతో మళ్ళీ అదే కాంబోలో ప్యారడైజ్ అనే సినిమా పట్టాలెక్కింది.ఇక అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సెప్టెంబర్ 24న సినిమా థియేటర్ లోకి వచ్చేసింది కూడా. అయితే సినిమా రిలీజ్ అయ్యాక నాని యాక్టింగ్ ,శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ,యాక్షన్స్ సీక్వెన్స్ తో పాటు ఇపుడు మరో విషయం కూడా ఆహైలెట్ అవుతుంది.అది ఏంటో తెలుసా … ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్ర.
చేసిన పాత్రలకు భిన్నంగా
అవును..‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా పొలిటికల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించాడు. ఇక సినిమాలో గెటప్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ చెప్పే విధానం అన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అనుకరించి ఉన్నాయన్న టాక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముఖ్యంగా ఒక నాయకుడు సభలో మాట్లాడుతున్నట్టుగా కనిపించే కొన్ని సీన్స్ లో ప్రియదర్శి అచ్చం కేసీఆర్ లాగే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, చేతులు ఊపడం, తెలంగాణా యాసలో డైలాగ్స్ చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో డిబేట్లకి దారి తీసింది. పైగా కేసీఆర్ ఫేమస్ డైలాగ్ అయిన చావు నోట్లో తల పెట్టిన అని చెప్పడంతో కేసీఆర్ ని ఇన్సిపిరేషన్ గా తీసికొనే ఈ పాత్రని డిజైన్ చేశారు అంటూ తేల్చేస్తున్నారు.
అచ్చం మా కేసీఆర్ తీరే
ఇక ఇది చూసిన బీఆరెస్ వర్గాలు ఇది అచ్చం మా కేసీఆర్ తీరే అంటూ తమ తమ సోషల్ మీడియా హ్యండిల్స్ లలో ఇబ్బడి ముబ్బడిగా ప్రియదర్శి సీన్స్ ని రికార్డ్ చేస్తూ పోస్ట్ లు పెట్టేస్తున్నారు.ఇక మరికొందరు అయితే kcr ఇన్ ప్యారడైజ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టయడం విశేషం.
అయితే ప్రియదర్శి పోషించిన ఈ ఎమ్మెల్యే శంకర్ పాత్రని కేసీఆర్ ని ఇన్సిపిరేషన్ గా తీసుకున్నామని మేకర్స్ ఎక్కడా చెప్పకపోవడంతో కేవలం ఇది యాదృచ్చికం అనే అనుకోవాలి.ఇక
ప్రియదర్శి విషయానికి వస్తే.. పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘బలగం’ వంటి సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వంశీకృష్ణ దొండపాటి దర్శకత్వంలో ఇడుపు కాయితం సినిమాతో మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు.
ఏమైనా క్లారిటీ ఇస్తారో
ఇక ప్యారడైజ్ సినిమాలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ పోషించిన పాత్రపై కూడా సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. ఆ పాత్రను చూసిన కొందరు ప్రేక్షకులు అలాంటి నటుడు అన్న ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నామంటూ పోస్టులు చేస్తున్నారు.’
also read :‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?
మొత్తానికి ప్యారడైజ్ సినిమాలో నాని, మోహన్ బాబు,పాత్రలతో పాటు ఇపుడు ప్రియదర్శి ,విజయ్ కుమార్ ల పాత్రలు కూడా ఆడియన్స్ నోళ్ళలో నానుతున్నాయి.మరి వీటిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారో చూడాలి .