E-Paper
Advertisement

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!
Advertisement

Road Safety: స్వేచ్ఛ  బ్యూరో: రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే, కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (టీజీ –ఎంఏఆర్ ఎస్ )ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అందుకు సంబంధించిన జీవో 135 విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నడిచే ‘రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి’ పరిధిలోనే ఈ కొత్త వ్యవస్థ పనిచేస్తుంది.ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ , ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.

ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు పని చేయాలి

Advertisement

బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక ‘రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్’ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించడం వీరు బాధ్యత. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు , 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డెటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన ‘హైవే పెట్రోలింగ్ యూనిట్లు’ నిరంతరం పహారా ఇస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల మొత్తంలో 40  శాతాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు మరియు అత్యవసర రోడ్డు మరమ్మతుల కోసమే ఉపయోగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రయాణాలు మరింత సురక్షితంగా మారనున్నాయి.

Also Read: ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?

Tags

Related News

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?

నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

Big Stories

Advertisement
×