AFG vs SL, Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా.. ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. సూపర్ 4 కోసం శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇవాళ సాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే. గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే హాంకాంగ్ ఎలిమినేట్ కాగా… మిగిలిన మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే శ్రీలంక రెండు మ్యాచ్ లలో రెండు విజయాలు నమోదు చేసుకొని… సేఫ్ ప్లేస్ లో ఉంది.
అటు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు నమోదు చేసుకొని… రెండో స్థానంలో నిలిచింది. అయితే బంగ్లాదేశ్ రన్ రేట్ మైనస్ లో ఉంది. ఇక ఆఫ్గనిస్తాన్ రెండు మ్యాచ్ లలో ఒకే ఒక్క మ్యాచ్ విజయం సాధించి.. టఫ్ పొజిషన్ లో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ ప్లస్ లో ఉండటం… వాళ్లకు కలిసి వచ్చింది. అయితే ఇవాళ శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చివరి లీగ్ దశ మ్యాచ్ ఉంది. ఇందులో కచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే.. శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ నేరుగా సూపర్ ఫోర్ లోకి ఎంట్రీ ఇస్తాయి. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని ఆఫ్ఘనిస్తాన్ కసరత్తులు చేస్తోంది.
Also Read: Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర