E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 పై తమన్ అదిరిపోయే అప్డేట్!

చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 పై తమన్ అదిరిపోయే అప్డేట్!
Advertisement

S.Thaman: ఎస్.తమన్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతూ.. అందరి దృష్టిని తన మ్యూజిక్ తో కట్టిపడేస్తున్నారు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చార్ట్ బస్టర్ సాంగ్స్ తో సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఊర మాస్ ఎలివేషన్స్ ఇవ్వాలన్నా.. పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి చిత్రానికి గూస్ బంప్స్ తెప్పించేలా మ్యూజిక్ అందించాలన్నా.. అది తమన్ కే సాధ్యమైంది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ఓజీ 2 సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే . ఇక పవన్ కళ్యాణ్ చిత్రాలకే కాదు మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.

చిరు మూవీపై తమన్ అదిరిపోయే పోస్ట్..

ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మరో సినిమా కోసం తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కలయికలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కాంబినేషన్ రాబోతోంది అని అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే అదే సమయంలో గతంలో చిరంజీవి, తమన్ కాంబినేషన్లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఆశించినంతగా సౌండ్ చేయలేదు. కానీ బాబి కలయికలో చిరంజీవి చేస్తున్న సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలియడంతో అభిమానులు కాస్త అనుమానాలు వ్యక్తం చేసినా.. తమన్ చేసిన కామెంట్లు అంచనాలను పెంచేసాయి.

Advertisement

also read:రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

ఆగస్టు 22న కలుద్దాం..

గతంలో ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు తమన్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ కి సరైన మెగా మ్యూజిక్ ఇచ్చే అవకాశం నాకు రాలేదు . కానీ ఈ సినిమాతో చిరు పై నాకున్న ప్రేమ ఏంటో సంగీతం ద్వారా చూపిస్తాను” అంటూ తెలిపాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ వదులుతూ అంచనాలు పెంచేశారు. ఈ మేరకు తన అధికారిక ఖాతా ద్వారా మెగా 158 చరిత్ర సృష్టించబోతోంది
.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న కలుద్దాం అంటూ ఫైర్ ఎమోజీతో ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు తమన్. ఇకపోతే ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ రోజున మెగా 158 మూవీ నుండి ఏదైనా ఒక బిగ్ అప్డేట్ మ్యూజిక్ సంబంధించింది ఇవ్వబోతున్నారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి

మెగా 158 మూవీ విశేషాలు..

Advertisement

మెగా 158 మూవీ విషయానికి వస్తే.. బాబి కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ తెలుగు యాక్షన్ డ్రామా చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా హైదరాబాదులో రెండవ షెడ్యూల్ షూటింగ్ ను వేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా అన్నస్వర రాజన్ నటిస్తుండగా.. ప్రియమణి , రచితా రామ్, నివేదా పేతురాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

నమ్మించి ముంచేసిన భర్త.. క్యాన్సర్‌తో అద్దె ఇంట్లోనే కన్నుమూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!

మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన అమీర్ ఖాన్!

ఎందుకీ సిగ్గులేని కక్ష సాధింపులు.. జనాలు చూస్తున్నారు.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మళ్లీ స్పందించిన ప్రకాష్ రాజ్!

Akhil Akkineni: నాకు అప్పుడే తెలుసు.. సమంత పై అఖిల్ ఊహించని కామెంట్స్!

Big Stories

×