Sai Abhyankkar:ఇప్పటివరకు అతి చిన్న వయస్సులో మ్యూజిక్ సెన్సేషన్ గా మారాడని అనిరుధ్ రవిచంద్రన్ కు ఒక గుర్తింపు ఉంది. స్టార్ హీరోలందరి సినిమాలకు అనిరుధ్ నే మ్యూజిక్ అందిస్తున్నాడు. మనోడి మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. బక్కోడే కానీ. మ్యూజిక్ మాత్రం ఇరగదీసాడు అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకొనేలా చేశాడు. ఇక ఇప్పుడప్పుడే అనిరుధ్ ను కొట్టేవాడు రాడు అనుకుంటున్న సమయంలోనే సాయి అభ్యంకర్ అడుగుపెట్టాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.
కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అభ్యంకర్.. ఒక్కసారిగా అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టేసరికి పాన్ ఇండియా రేంజ్ లో అతడికి గుర్తింపు లభించింది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కేవలం 20 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్ ఇవ్వడమా.. సెట్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇప్పటివరకు బన్నీ.. దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ, థమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తోనే హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కుర్రాడైన అభ్యంకర్ తో జత కట్టాడు. ఈ విషయం తెలియడంతో అందరి చూపు అల్లు అర్జున్ సినిమాపైనే ఉంది.
అయితే బన్నీ సినిమా కన్నా ముందే అభ్యంకర్ అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు. సాయి అభ్యంకర్ ఇప్పటికే సూర్య, కార్తీ, శివకార్తికేయన్, శింబు, లారెన్స్, షేన్ నిగమ్‌లతో ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ నే మ్యూజిక్ అందిస్తున్నాడు. నేడు సూర్య పుట్టినరోజు కావడంతో కరుప్పు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు హైలైట్ అంటే.. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అని చెప్పాలి. ఒక చిన్న కుర్రాడు.. ఈ రేంజ్ మ్యూజిక్ ను అందించడం అంటే మాములు విషయం కాదు. కరుప్పు టీజర్ చూసినవారందరూ కూడా ఏ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు.
ఇక కరుప్పు టీజర్ చూసాకా బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా కరుప్పు టీజర్ లో మ్యూజిక్ చూసాక.. దిగులు పడాల్సిన అవసరం లేదురా .. ఈ కుర్రాడు బన్నీ సినిమాకు గత్తర లేపుతాడు.. డౌట్ అవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యనే సాయి అభ్యంకర్ తో అట్లీ వీడియో కాల్ లో మాట్లాడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. మరి కరుప్పు సినిమాతో సాయి అభ్యంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూసాకా.. బన్నీ సినిమాకు కుర్రాడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో ఒక అంచనా వస్తుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అందుకే బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా. మంచి విజయం కావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.