E-Paper
Advertisement

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా
Advertisement

Telugu Gangster Drama: వీకెండ్ వచ్చిందంటే చాలు… ఓటీటీలో ఏదైనా పక్కా లోకల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ దొరికితే బాగుంటుందని వెతుకుతుంటాం కదా. అలాంటి ప్రేక్షకుల కోసం రా అండ్ రస్టిక్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామాతో వచ్చిన తెలుగు సినిమా ‘అనకాపల్లి’ (Anakapalli). అనకాపల్లి ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఏకంగా రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ ఓటీటీల పేర్లు ఏంటి ? సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అనకాపల్లిలో నివసించే యువకుడు సూర్య. అతని తండ్రి శాంబశివరావు విద్యుత్ శాఖలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగి. తండ్రిలా సాధారణ జీవితాన్ని గడపడం సూర్యకు నచ్చదు. సమాజంలో పలుకుబడి, పేరు, పవర్ ఉన్న వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటాడు. అదే సమయంలో అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్ అనే గ్యాంగ్‌స్టర్ క్రైమ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. అతని పేరు చెబితేనే స్థానికులు భయపడే పరిస్థితి ఉంటుంది.

Advertisement

బుల్లెట్‌కు ఉన్న పేరు, పలుకుబడి చూసి ఆకర్షితుడైన సూర్య అతని గ్యాంగ్‌లో చేరతాడు. కొద్దికాలంలోనే బుల్లెట్‌కు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా మారతాడు. గ్యాంగ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ క్రైమ్ ప్రపంచంలో ఎదుగుతుంటాడు. ఈ క్రమంలో బుల్లెట్‌కు, డ్రగ్స్ వ్యాపారం చేసే నాయుడుకు మధ్య గొడవలు జరుగుతుంటాయి. చివరకు సూర్య, బుల్లెట్ కలిసి నాయుడిని హత్య చేయడంతో పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి.

ఇదిలా ఉంటే, సూర్య జీవితంలోకి అమ్ములు ప్రవేశిస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత సూర్య ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. ఒకవైపు బుల్లెట్‌పై ఉన్న నమ్మకం, మరోవైపు ప్రేమ, తనకంటూ ఓ ప్రత్యేక జీవితం నిర్మించుకోవాలనే కోరిక అతడిని ఇబ్బందుల్లో పడేస్తాయి. బుల్లెట్‌కు అత్యంత దగ్గరగా ఉన్న సూర్య, చివరకు అతడికే ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి ? ఎమ్మెల్యే అనుచరులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే గొడవల్లో సూర్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? అన్నదే మిగతా కథ.

రెండు ఓటీటీలో స్ట్రీమింగ్

Advertisement

‘అనకాపల్లి’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నవంబర్ 3 నుంచి సన్‌ నెక్స్ట్ (Sun NXT)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు భాషలో రూపొందిన ఈ సినిమా రన్ టైమ్ సుమారు 2 గంటల 34 నిమిషాలు. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఈ సినిమాను మిస్ అవ్వొద్దు. విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని (Khagesh Tammineni) దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina) కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

Read Also: పసిపాప మాస్క్‌ వేసుకున్న సైకో కిల్లర్‌… కల్లో కనిపించిన కిల్లర్ నిజమైతే… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్

Related News

గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పండగే.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినవి సినిమాలు..!

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

తండ్రి నమ్మకం… కూతురి పట్టుదల… ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా

సొంత సైన్యంలోనే కోవర్ట్… రెండవ ప్రపంచ యుద్ధం వెనుకున్న మిస్టరీ… యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన వార్ థ్రిల్లర్

తెలియని నంబర్ నుంచి ఆ ఫోన్ కాల్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో అలరించే తమిళ్ క్రైమ్ కామెడీ

Big Stories

Advertisement
×