E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మెగా హీరో సినిమా సస్పెన్స్..వంద కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరేనా?

మెగా హీరో సినిమా సస్పెన్స్..వంద కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరేనా?
Advertisement

Sambarala Yetigattu : సినిమా రేంజ్ మారింది…భాష బ్యారియర్స్ దాటింది..టోటల్ గా టాలీవుడ్ ప్యాన్ ఇండియా ట్యాగ్ సాలిడ్ గా వేసేసుకుంది.అవును.. ఒకప్పుడు సినిమా కాసింత డిలే అయిందంటే చాలు ఫలితం తేడా కొడుతుందా ఏంటి అన్న డౌట్స్ రైజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది.

‘బాహుబలి’, ‘పుష్ప’, ‘RRR’ వంటి సినిమాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వేగం కంటే విజువల్స్ పర్‌ఫెక్షన్, వరల్డ్ బిల్డింగ్, క్వాలిటీ కంటెంట్‌కే పెద్ద పీట వేస్తున్నారు.ఈ రేసులో కేవలం స్టార్ దర్శకులు, టాప్ హీరోల చిత్రాలే కాదు, యంగ్ హీరోల ప్రాజెక్టులు సైతం భారీ బడ్జెట్లతో మరింత డిలే అయిపోతున్నాయ్.ఈ క్రమంలోనే సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సంబరాల యేటిగట్టు’ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 

Advertisement

‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో, కొత్త దర్శకుడు రోహిత్ కేపీ కాంబినేషన్‌లో దాదాపు రెండేళ్ల క్రితం ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. సాయిధరమ్ తేజ్ మార్కెట్ కన్నా మించి, ఊహించని రేంజ్‌లో సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారు మేకర్స్.

also read :Mega 158.. హైదరాబాద్‌లోనే మెగాస్టార్ వేట.. బాబీ నయా ప్లాన్ నెక్ట్స్ లెవెల్ అంతే!

Advertisement

అయితే మొదట్లో ఈ చిత్రాన్ని గత ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, రిలీజ్ చేయలేకపోయారు. కనీసం రాబోయే దసరా సీజన్‌కైనా థియేటర్లలోకి వస్తుందా అంటే అదీ నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ఇక ఇదే క్రమంలో కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో టెన్షన్ పడిపోతున్నారు మెగా ఫ్యాన్స్.

 సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగెటివ్ టాక్ 

ఇక ఈ గ్యాప్ వల్లే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఎన్నో రూమర్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్. అనుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటిపోయిందని, వంద కోట్లకు పైగా ఖర్చు చేసినా ఇంకా కీలకమైన షూటింగ్ భాగం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని గట్టిగా ప్రచారం సాగింది. భారీగా పెరిగిన ఈ వ్యయాన్ని ఎలా రికవర్ చేయాలో, ఏ స్థాయిలో బిజినెస్ చేసుకోవాలో తెలియక నిర్మాత సతమతమవుతున్నారనే నెగెటివ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లీకులపై అటు చిత్ర యూనిట్ గానీ, ఇటు హీరో గానీ ఖండించకపోవడం, మీడియాకి కూడా అంటీ ముట్టనట్టు ఉండటంతో ఈ గాసిప్స్ నిజమేనని చాలామంది నమ్మారు.

సరైన సక్సెస్ కొడతారో లేదో !

అయితే ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ సాయిధరమ్ తేజ్ ఈ మధ్యే మీడియా ముందుకు వచ్చారు. తమ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ‘హనుమాన్’ త్రీడీ వర్షన్ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తేజును అభిమానులు ఈ సినిమా అప్‌డేట్ గురించి నిలదీశారు. దీనిపై తేజు స్పందిస్తూ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించినా, పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ఓటీటీ విప్లవం వల్ల ప్రేక్షకులు వరల్డ్ వైడ్ గా ఉన్న డిఫరెంట్ కంటెంట్ ని వెబ్ సిరీస్‌లను చూస్తూ చాలా అప్‌డేట్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆడియన్స్ ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పు వచ్చిందని, ఇప్పుడు ఆషామాషీగా కంటెంట్ ఇస్తే థియేటర్లకు రావడం లేదని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతోనే తాము మరింత జాగ్రత్తగా, సమయం తీసుకుని క్వాలిటీతో సినిమాను సిద్ధం చేస్తున్నట్లు అసలు విషయం చెప్పుకొచ్చారు.

also read :సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన షణ్ముఖ్ జస్వంత్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

అయితే తేజు చెప్పిన సమాధానం వినడానికి బాగున్నా, అది కేవలం బడ్జెట్ ఇష్యూస్ మరియు డిలేని కప్పిపుచ్చే ‘కవరింగ్’ లాగే ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా అసలు స్టేటస్ ఏంటి, ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే లాజికల్ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకపోవడం మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది.చూడాలి మరి ..క్వాలిటీ కోసమే డిలే అంటున్న మేకర్స్ సరైన సక్సెస్ కొడతారో లేదో !

Related News

బుల్లితెర ‘కిలాడీ లేడీ’.. సోషల్ మీడియా ట్రాప్‌తో యువకులకు టోకరా వేసిన ప్రముఖ నటి అరెస్ట్!

బన్నీ-లోకేశ్ కాంబో.. షూటింగ్ మొదలవ్వకుండానే పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ అప్‌డేట్!

రోజు గడిచాక బర్త్‌డే విషెస్.. అసలు కథేంటి? వైరల్ అవుతున్న త్రిష లేటెస్ట్ పోస్ట్!

‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ కాదు’.. మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్!

రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

పెద్ద సినిమాల్లో బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !

ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సుధీర్‌తో సినిమా‌ వార్తలపై స్పందించిన రష్మి.. అంత మాట అనేసిందేంటీ?

Big Stories

×