E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Mega 158.. హైదరాబాద్‌లోనే మెగాస్టార్ వేట.. బాబీ నయా ప్లాన్ నెక్ట్స్ లెవెల్ అంతే!

Mega 158.. హైదరాబాద్‌లోనే మెగాస్టార్ వేట.. బాబీ నయా ప్లాన్ నెక్ట్స్ లెవెల్ అంతే!
Advertisement

Mega 158: పోయిన పొంగల్ కి వచ్చి బాక్సాఫీస్ కా బాస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్న మెగా స్టార్ ఇపుడు మరో సునామి క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.గతంలో ఇండస్ట్రీకి వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర), చిరు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’. వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

దానికి తోడు మేకర్స్ రిలీజ్ చేసిన “ది స్పిరిట్ ఆఫ్ మెగా 158” గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హల్ చల్ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. బ్లడీ బెంచ్‌మార్క్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

హైదరాబాద్‌లో మొదలైన మరో షెడ్యూల్ 

అవును ..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే తమిళనాడులోని పొల్లాచ్చి అడవుల్లో ఎంతో గ్రాండ్‌గా పూర్తయింది. అక్కడ చిరంజీవి మరియు చిత్ర యూనిట్ దిగిన కొన్ని లీక్డ్ ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఆ ఉత్సాహం తగ్గకముందే బాబీ టీం తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షూటింగ్ షెడ్యూల్ మన హైదరాబాద్‌లోనే గ్రాండ్ గా  ప్రారంభమైంది. ఈ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ఒక క్రేజీ వీడియోను కూడా విడుదల చేశారు.

Advertisement

also read :సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన షణ్ముఖ్ జస్వంత్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

2023 జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వాల్తేరు వీరయ్య సినిమా ఎంతటి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఆ సినిమా అప్పట్లో దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మళ్లీ అదే డైరెక్టర్ బాబీతో చిరు జతకట్టడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది.ఈ కొత్త హైదరాబాద్ షెడ్యూల్‌లో చిరంజీవిపై వచ్చే ప్రతి షాట్ ఎంతో అద్భుతంగా, థియేటర్లలో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉండబోతుందని, ప్రతి సన్నివేశం ఒక పెద్ద వేడుకలా డిజైన్ చేసినట్లు డైరెక్టర్ బాబీ హింట్ ఇచ్చారు.

చిరు అదే జోరుని కంటిన్యూ చేస్తాడో లేదో

ఇక ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో గ్లామర్ అండ్  టాలెంటెడ్ బ్యూటీస్ నివేదా పేతురాజ్, అనస్వర రాజన్‌లను కీలక పాత్రల కోసం సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతున్న షూటింగ్‌లో చిరంజీవితో పాటు నివేదా, అనస్వర మరియు మరికొంతమంది కీలక నటీనటులపై వచ్చే కొన్ని ముఖ్యమైన డ్రామా సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

also read :వెంకీ-అనిల్ రావిపూడి సినిమా పేరిట నకిలీ కాస్టింగ్ కాల్స్.. మోసపోవద్దంటూ మేకర్స్ హెచ్చరిక!

ఇక ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాబీ గత చిత్రాలైన జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాల్లో తమన్ సౌండ్ ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే.చూడాలి మరి సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరు అదే జోరుని కంటిన్యూ చేస్తాడో లేదో !

Related News

మెగా హీరో సినిమా సస్పెన్స్..వంద కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరేనా?

సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన షణ్ముఖ్ జస్వంత్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

వెంకీ-అనిల్ రావిపూడి సినిమా పేరిట నకిలీ కాస్టింగ్ కాల్స్.. మోసపోవద్దంటూ మేకర్స్ హెచ్చరిక!

గాయత్రి గుప్తా సెన్సేషనల్ వీడియో.. చావు అంచున ఉన్నానంటూ నటి కన్నీటి పర్యంతం!

అయ్యగారికి అదృష్టం కలిసి వచ్చేనా.. ‘లెనిన్’ రిపేర్లు వర్కవుట్ అవుతాయా?

సమ్మర్ ముగిసినా సందడి తగ్గలేదు.. జూన్ చివరి వారంలో సినీ లవర్స్‌కు ఫుల్ మీల్స్!

పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్

Big Stories

×